Jawan 8 Days Collections: జవాన్‌కు బిగ్ షాక్.. అయినా అన్ని కోట్లా.. షారూక్ భార్యకు లాభం ఎంతంటే!
ఇప్పుడు దేశ వ్యాప్తంగా చాలా భాషల నుంచి పాన్ ఇండియా హీరోలు వచ్చారు. కానీ, చాలా కాలం క్రితమే తన రేంజ్‌ను వరల్డ్ వైడ్‌గా పెంచుకుని సత్తా చాటిన హీరో షారూక్ ఖాన్. ఇలా దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా హవాను చూపిస్తోన్న ఆయన.. చాలా ఫ్లాపుల తర్వాత 'పఠాన్'తో సత్తా చాటాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు 'జవాన్' మూవీతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే రెస్పాన్స్ భారీగా వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. అయితే, 8వ రోజు మాత్రం ఇది బాగా డౌన్ అయింది. ఈ నేపథ్యంలో 'జవాన్' మూవీ బాక్సాఫీస్ రిపోర్టను మీరే చూడండి!
జవాన్‌గా షారూక్ ఖాన్ ఎంటర్:సీనియర్ స్టార్ హీరో షారూక్ ఖాన్ నటించిన సినిమానే 'జవాన్'. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. దీనికి అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చాడు.

జవాన్ మూవీ బిజినెస్.. రిలీజ్:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'జవాన్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 300 కోట్లు మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని వరల్డ్ వైడ్‌గా 10000లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.
ఏ రోజు ఎంత వచ్చిందంటే?:అట్లీ - షారూక్ ఖాన్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీకి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు మంచి స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తుతూనే ఉన్నాయి. దీంతో ఈ చిత్రం వారంలో రూ. 368.38 కోట్లు నెట్ వసూలు చేసింది. అలాగే, రూ. 650 కోట్లు వరకూ గ్రాస్‌ను కూడా రాబట్టి ఎన్నో రికార్డులను నమోదు చేసుకుంది.

8వ రోజు ఎంత వచ్చిందంటే:షారూక్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించిన 'జవాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. అయితే, 8 రోజు ఈ చిత్రానికి వసూళ్లు బాగా తగ్గిపోయాయి. ఫలితంగా 8వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 'జవాన్' మూవీ రూ. 18.50 కోట్లు నెట్, రూ. 28 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు:బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే 'జవాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ అక్కడ మిలియన్ల డాలర్లను వసూలు చేస్తోంది. ఇక, 8 రోజులకు కలిపితే వరల్డ్ వైడ్‌గా 25.9 మిలియన్ డాలర్లు అంటే రూ. 215.07 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేసింది.

8 రోజులకూ కలిపి ఎంతంటే:యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'జవాన్' మూవీకి ఓవరాల్‌గా మంచి రెస్పాన్సే లభిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 8 రోజులకూ కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 386.28 కోట్లు నెట్‌తో పాటు రూ. 678 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా వేగంగా రూ. 400 కోట్లు నెట్ వసూళ్లను అందుకున్న హిందీ చిత్రంగా నిలిచేందుకు మరింతగా చేరువ అయింది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:షారూక్ నటించిన'జవాన్' మూవీకి రూ. 300 కోట్లు వరకూ బడ్జెట్ అయింది. అంతకంటే ఎక్కువగానే ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ జరిగింది. ఇక, రూ. 300 కోట్లు నెట్ టార్గెట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎనిమిది రోజుల్లో రూ. 386.28 కోట్లు రాబట్టింది. అంటే హిట్ స్టేటస్‌తో పాటు నిర్మాత షారూక్ భార్యకు రూ. 86.28 కోట్లు లాభాలను కూడా తెచ్చింది.


Click it and Unblock the Notifications











