Dunki Day 3 Collections షారుక్ మూవీకి గడ్డుకాలం.. కష్టంగా డంకీకి 100 కోట్ల కలెక్షన్లు
బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్, టాప్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో వచ్చిన డంకీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడాబనికి కష్టాలు పడుతున్నది. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తర్వాత మూవీ ఆకట్టుకోకపోవడంతో వసూళ్లు ప్రతికూలంగా మారాయి. అయితే షారుక్ నటించిన ఈ సినిమా 2వ రోజు ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
డంకీ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే.. ఈ చిత్రం 200 కోట్ల రూపాయలతో భారీగా నిర్మించారు. ఈ సినిమాకు భారీ బజ్ ఉండటంతో రికార్డు స్థాయిలో సినిమాను రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 5000 స్క్రీన్లలో విడుదల చేశారు. అయితే ఈ సినిమా దారుణమైన టాక్ సొంతం చేసుకోవడంతో స్క్రీన్ల సంఖ్య దారుణంగా పడిపోయింది.

ఇక డంకీ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నెగిటివ్ రివ్యూలు, టాక్‌లోను కూడా భారీగానే కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా తొలి రోజు 35 కోట్ల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 128 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
డంకీ సినిమా 2వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేర్, 30 కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇక రెండో రోజుల్లో ఓవర్సీస్‌లో ఈ సినిమా 42 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 75 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసింది.
డంకీ సినిమా దేశవ్యాప్తంగా దారుణమైన ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ సినిమాకు ప్రేక్షకుల లేకపోవడంతో చాలా చోట్ల షోలు రద్దయ్యాయి. హిందీ రాష్ట్రాల్లో పలు షోలు రద్దు చేసి సలార్ సినిమాను ప్రదర్శించడం మొదలుపెట్టారు. దాంతో డంకీ సినిమాపై భారీ ప్రభావం పడింది. ఇక మూడో రోజు కేవలం 26 కోట్లు నికరంగా ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 3 వ రోజు 31 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 100 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఏర్పడింది.

డంకీ సినిమా లాభాల్లోకి రావాలంటే ఈ మూవీ ముందు భారీ లక్ష్యమే కనిపిస్తున్నది. ఈ సినిమా 210 కోట్లు వసూలు చేస్తే హిట్ ఖాతాలోకి చేరుతుంది. అంతకంటే తక్కువ నమోదు చేస్తే యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది. ఈ సినిమా రానున్న రోజుల్లో హిట్ ఖాతాలో చేరుతుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











