Jawan Advance Booking Report బాహుబలి 2, గదర్ 2 రికార్డులను జవాన్ బ్రేక్.. బాక్సాఫీస్ వద్ద షారుక్ సంచలనం
బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. పఠాన్ మూవీతో 1000 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిన షారుక్ మరోసారి జవాన్‌లో సంచలనాలు నమోదు చేయడానికి సిద్దమయ్యాడు. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్‌కు ముందే బాహుబలి, పఠాన్, గదర్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తున్నాయి.
జవాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు కేవలం ఉత్తరాదిలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో భారీ వసూల్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేస్తున్నది. జవాన్ అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

జవాన్ సినిమా విషయానికి వస్తే అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమాను గౌరీఖాన్, గౌరవ్ వర్మ తెరకెక్కించాం. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అవుతున్నది.
షారుక్ ఖాన్ విషయానికి వస్తే.. వరుస పరాజయాల తర్వాత పఠాన్‌తో రికార్డు కలెక్షన్లను సాధించింది.జవాన్ తొలి రోజున 57 కోట్ల రూపాయల కలెక్షన్లను ఇండియాలో వసూలు చేస్తున్నది. అయితే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాలను పరిశీలిస్తే. పఠాన్ సినిమా రికార్డును తిరగరాసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొంటున్నది.

జవాన్ మూవీ తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ విషయాల్లోకి వెళితే.. నేషనల్ మల్టీప్లెక్స్‌లో కలెక్షన్లు భారీగా నమోదు అయ్యాయి. పీవీఆర్ మల్టీప్లెక్స్‌లో 1,70,295 టికెట్లు, ఐనాక్స్ 1,15,218 టికెట్లు, సినీ పోలిస్ 57,120 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఢిలీ, ముంబై, బెంగళూరు, హైదరబాద్, కోల్‌కతా, చెన్నై నగరాల్లో భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే 8.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. గదర్ 2, బాహుబలి, పఠాన్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను జవాన్ అధిగమించింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో జవాన్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఢిల్లీలో 60 వేల టికెట్లు అమ్ముడుపోగా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ముంబైలో 55 వేల టికెట్లు అమ్ముడుపోగా, 2.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక బెంగళూరులో 60 వేల టికెట్లు అమ్ముడుపోగా 2 కోట్లకుపైగా వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయి. కోల్‌కతాలో 50 వేల టికెట్లు అమ్ముడుపోగా 1.5 కోట్ల రూపాయలు వచ్చాయి. చెన్నైలో 75 వేల టికెట్లు అమ్ముడుపోగా 1.5 కోట్ల కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు అయ్యాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











