Jawan Day 3 Box office Report 300 కోట్లు కొల్లగొట్టిన జవాన్.. షారుక్ మూవీ కలెక్షన్ల సునామీ
సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ రికార్డులను క్రియేట్ చేస్తున్నది. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లోనే ఈ సినిమా 250 కోట్ల మేర వసూళ్లను సాధించింది. నయనతార, దీపిక పదుకోన్, విజయ్ సేతుపతి, యోగిబాబు నటించిన ఈ చిత్రం ఓవర్సీస్‌లోను, దేశవ్యాప్తంగా సంచలన రీతిలో కలెక్షన్లు నమోదు చేస్తున్నది. ఈ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఉత్తర అమెరికాలో జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తున్నది. ఈ చిత్రం అమెరికా, కెనడాలో ఊహించిన రీతిలో కలెక్షన్లను సాధించింది. జవాన్ చిత్రం అమెరికాలో 12 కోట్ల రూపాయలు, కెనడాలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఉత్తర అమెరికాలో ఈ చిత్రం 15 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

ఇక జవాన్ చిత్రం యూకేలో తొలి రోజు 3 లక్షల పౌండ్లు, రెండో రోజు 3 లక్షల పౌండ్లు, మూడో రోజు 2 లక్షల పౌండ్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం యూకేలో 8 కోట్ల రూపాయలు రాబట్టింది. ఆస్ట్రేలియాలో ఈ చిత్రం ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 1 కోటి రూపాయలు, జర్మనీలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఇండియాలో జవాన్ చిత్రం బాక్సాఫీస్ జోరుకు అడ్డు అదుపులేకుండా పోయింది. గత రెండు రోజుల్లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 204 కోట్ల వసూళ్లు సాధించింది. మూడో రోజు75 కోట్ల షేర్ వసూలు చేయడానికి సిద్దమైంది. దాంతో ఈ చిత్రం 300 కోట్లకు చేరువ కానున్నది.

గత మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం గత మూడు రోజుల్లో 320 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రోజు 139.6 కోట్లు, రెండో రోజు 212 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు కూడా మరో 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











