Jawan overseas Collections చరిత్ర సృష్టించిన జవాన్ మూవీ.. ఓవర్సీస్‌లో షారుక్ రికార్డులు బ్రేక్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్లు సాధిస్తూ సునామీని మరిపిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే 700 కోట్లకు చేరువైన ఈ చిత్రం రెండో వారంలో కూడా అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. అయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను నమోదు చేస్తూ 100 కోట్ల రూపాయల మార్కుకు చేరువైంది. జవాన్ చిత్రం ఓవర్సీస్‌లో సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఉత్తర అమెరికాతోపాటు ఇతర దేశాల్లో ఈ సినిమా కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే..
జవాన్ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన రిలీజైనప్పటి నుంచి ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారిస్తున్నది. ఈ సినిమా ఉత్తర అమెరికాలో అంటే.. అమెరికా, కెనడాలో కలిపి రికార్డు లెవల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. గత ఏడు రోజుల్లో ఈ సినిమా సాధించిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

తొలి రోజు $1,371,345
రెండో రోజు $1,798,659
మూడో రోజు $2,484,798
నాలుగో రోజు $1,839,145
ఐదో రోజు $552,403
ఆరో రోజు $840,668
ఏడో రోజు $450,496
మొత్తంగా ఏడు రోజుల్లో ఈ చిత్రం 9 మిలియన్ డాలర్లను రాబట్టింది. అంటే దాదాపు అమెరికా, కెనడాలో కలిపి 77.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల కలెక్షన్ల వివరాల్లోకి వెలితే.. ఈ సినిమా ఇప్పటి వరకు 1.5 మిలియన్ పౌండ్ల వసూలు చేసింది. అంటే.. సుమారు 15 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇక ఆస్ట్రేలియాలో 15 కోట్ల రూపాయలు, న్యూజిలాండ్‌లో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

దాంతో జవాన్ సినిమా కేవలం ఓవర్సీస్‌లోనే సుమారుగా 110 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా బలంగా, నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం దాదాపు 660 కోట్ల రూపాయలను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











