Jawan Pre Release business.. షారుక్ మూవీకి 200 కోట్ల బడ్జెట్.. రిలీజ్‌కు ముందే వందల కోట్ల లాభం!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తాజా విజయం పఠాన్‌తో మరింత జోష్‌ను చూపిస్తాడు. దాదాపు 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం తర్వాత ప్రస్తుతం జవాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయన తార, ప్రియమణి, విజయ్ సేతుపతి, యోగి బాబు నటించారు. ఈ సినిమా ఆగస్టు 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..
పఠాన్ తర్వాత జవాన్ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను సుమారు 200 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ఈ సినిమా బడ్జెట్‌కు మించి ఈ సినిమా బిజినెస్ చేసింది. జవాన్ చేసిన బిజినెస్ వివరాలు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

జవాన్ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. శాటిలైట్ హక్కులను 85 కోట్ల రూపాయలకు అమ్మినట్టు తెలిసింది. ఇక డిజిటల్, ఓటీటీ హక్కుల 130 కోట్లు, మ్యూజిక్ హక్కులు 35 కోట్లు అమ్ముడుపోయాయి. మొత్తంగా 250 కోట్ల రూపాయల బిజినెస్ నమోదైంది.
ఇక తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఏపీ, తెలంగాణలో కలిపి 15 కోట్లుపైగా బిజినెస్ జరిగింది. నైజాంలో 10 కోట్లు, ఆంధ్రాలో ఈ సినిమా హక్కులు 5 కోట్లుకు అమ్ముడుపోయాయి.
ఇక తెలుగేతర రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలో థియేట్రికల్ హక్కులు 15 కోట్లు, కేరళ హక్కులు 7 కోట్ల రూపాయలు, హిందీ, మిగితా రాష్ట్రాల హక్కులు 155 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఓవర్సీస్ హక్కులు 105 కోట్లు అమ్మారు.
జవాన్ థియేట్రికల్, నాన్ థ్రియేట్రికల్ హక్కులు మొత్తం వివరాల్లోకి వెళితే.. నాన్ థియేట్రికల్ హక్కులు 250 కోట్ల రూపాయలు, థియేట్రికల్ హక్కులు 315 కోట్ల రూపాయలు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం ద్వారా 565 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. బడ్జెట్ 200 కోట్లను దృష్టిలో పెట్టుకొంటే.. దాదాపు 365 కోట్లకుపైగా టేబుల్ ప్రాఫిట్ లభించింది.


Click it and Unblock the Notifications











