Jawan 11 Days Collections 1000 కోట్లకు చేరువగా జవాన్.. 11వ రోజున షారుక్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్ర కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 7వ తేదీ కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకోని రిలీజైన ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తూ భారీ వసూళ్లతో జైత్ర యాత్రను మరిపిస్తున్నది. గత 10 రోజుల్లో 700 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం 11వ రోజున అతివేగంగా కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డుకెక్కింది. ఈ చిత్రం బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
జవాన్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్:జవాన్ చిత్రంలో దీపిక పదుకోన్, నయనతార, విజయ్ సేతుపతి, సంజయ్ దత్ లాంటి అగ్రనటుల మేలవింపుతో సినిమాను రూపొందించడంతో భారీ బడ్జెట్ చిత్రంగా నిలిచింది. ప్రమోషన్ కార్యక్రమాలతోపాటు ప్రొడక్షన్ కాస్ట్, రెమ్యునరేషన్లు కలుపుకొని ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను 300 కోట్ల షేర్ కలెక్షన్లుగా నిర్ణయించారు.

జవాన్ ప్రీ రిలీజ్ బిజినెస్:జవాన్ సినిమాను బిజినెస్ భారీగానే జరిగింది. హిందీ వెర్షన్ రైట్స్ పెన్ మరుధార్ ఎంటర్‌టైన్‌మెంట్ (నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా) ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నది. తమిళనాడు రైట్స్ రెడ్ జెయింట్స్ మూవీస్, తెలుగు హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌కు చెందిన దిల్ రాజు, కేరళ హక్కులను శ్రీ గోకులం మూవీస్, బెంగాల్ హక్కులను ఎస్‌వీఎఫ్, ఓవర్సీస్ హక్కులను యష్ రాజ్ ఫిలింస్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకొన్నది.

1000 స్క్రీన్లలో రిలీజ్:జవాన్ సినిమా టీజర్, గ్లింప్స్, ట్రైలర్, పాటలకు భారీ క్రేజ్ దక్కడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో డిమాండ్ తగినట్టు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో 5500 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 4500 స్కీన్లలో కలిపి మొత్తంగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. షారుక్ ఖాన్ కెరీర్‌లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేసిన చిత్రంగా రికార్డుకెక్కింది.

ఓవర్సీస్‌లో 300 కోట్ల క్లబ్‌లోకి:ఓవర్సీస్‌లో జవాన్ చిత్రానికి ఊహించని కలెక్షన్లు లభించాయి. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో భారీ కలెక్షన్లు సాధించింది. ఉత్తర అమెరికా అంటే.. అమెరికా రాష్ట్రాలు, కెనడాలో మొత్తంగా 11.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అంతటే భారతీయ కరెన్సీలో 94 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 33.5 మిలియన్ డాలర్లు అంటే 279 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇండియాలో జవాన్ కలెక్షన్లు:జవాన్ చిత్రం ఇండియాలో రికార్డు వసూళ్లను రాబట్టింది. తొలివారంలో ఇండియాలో హిందీ వెర్షన్ 348 కోట్లు, తమిళంలో 24 కోట్లు, తెలుగులో 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండోవారంలో మూడు రోజుల విషయానికి వస్తే శుక్రవారం 19 కోట్ల రూపాయలు, శనివారం 32 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 440 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసింది.

11 రోజుల్లో జవాన్ కలెక్షన్లు ప్రపంచవ్యాప్తంగా :జవాన్ చిత్రం 11వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 35 కోట్ల రూపాయల షేర్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. గత 10 రోజుల్లో 767 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే 11వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 810 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే వారంలోగా ఈ సినిమా 1000 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











