Pathaan 33 Days Collections: వరల్డ్ వైడ్‌గా పఠాన్ బీభత్సం.. బాహుబలి 2 రికార్డుకు చేరువగా!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా పఠాన్. సుమారు ఐదేళ్ల తర్వాత వస్తున్న షారుక్ ఖాన్ సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినవిధంగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది పఠాన్ మూవీ. ఇక గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణెతో నాలుగోసారి షారుక్ జంటగా నటించిన ఈ చిత్రానికి విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇలా వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న పఠాన్ సినిమా 33వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

ఖాన్ త్రయంలో ఒకరిగా..

ఖాన్ త్రయంలో ఒకరిగా..

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. ఎంతో కాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు షారుక్. సుమారు 80కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. ఖాన్ త్రయంలో ఒకరిగా సుధీర్ఘ కాలంగా సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న షారుక్ ఖాన్ చివరిగా 2018లో జీరో సినిమాతో ఫ్లాప్ చూశాడు. తాజాగా పఠాన్ తో వరల్డ్ వైడ్ గా సాలిడ్ హిట్ కొట్టాడు.

ప్రీరిలీజ్ బిజినెస్ డీటెల్స్..

ప్రీరిలీజ్ బిజినెస్ డీటెల్స్..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాద్ షా గా రాణిస్తున్న షారుక్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటన, యాక్షన్ స్టంట్స్, కామెడీకి ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే పఠాన్ సినిమాపై మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే పఠాన్ సినిమా హక్కులకు హై రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. బిజినెస్ కు తగినట్లుగా పఠాన్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 8000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

32 రోజుల్లో వసూళు చేసింది..

32 రోజుల్లో వసూళు చేసింది..

షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా, అషుతోష్ రాణా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన సినిమానే పఠాన్. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు కలెక్ట్ అవుతున్నాయి. అయితే పఠాన్ చిత్రానికి 32 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 523.23 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా.. అందులో రూ. 18.13 కోట్లు దక్షిణాది భాషల నుంచి వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే మొత్తంగా ఈ సినిమాకు ఇప్పటివరకు రూ. 1017 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్లు వెల్లడించాయి.

ఐదో వారం కలెక్షన్స్..

ఐదో వారం కలెక్షన్స్..

హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగిన పఠాన్ చిత్రంలో షారుక్, దీపికా పదుకొణె కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఇప్పటికీ విడుదలై ఐదు వారాలు పూర్తి కావొస్తుంది. అయితే కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కావట్లేదు పఠాన్. ఈ క్రమంలో పఠాన్ చిత్రానికి ఈ వీకెండ్ లోని శుక్రవారం రూ. 1.02 కోట్లు, శనివారం రూ. 1.98 కోట్లు కలెక్ట్ చేయగా.. 33వ రోజు అయిన ఆదివారం నాడు రూ. 2.45 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

33 రోజుల్లో కలిపి వసూళ్లు..

33 రోజుల్లో కలిపి వసూళ్లు..

పఠాన్ విడుదలకు ముందు బేషరమ్ రంగ్ సాంగ్ వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. అయితే పఠాన్ ను ఎన్ని వివాదాలు చుట్టుముట్టిన ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడలేదు. అలా తొలి రోజు నుంచి దూసుకుపోతూ 33వ రోజుకు చేరుకుంది షారుక్ ఖాన్ సినిమా. ఈ క్రమంలో పఠాన్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 33 రోజుల్లో మొత్తంగా కలిపి రూ. 525.61 కోట్ల నెట్ వసూలు కాగా.. రూ. 1021 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ అయింది.

ఓవర్సీస్ లో ఎలా ఉందంటే..

ఓవర్సీస్ లో ఎలా ఉందంటే..

పఠాన్ సినిమాలో తన విలనిజంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ప్రతి సన్నివేశంలో ఇంటెన్సిటీ చూపిస్తూ స్ట్రాంగ్ విలన్ అని నిరూపించుకున్నాడు. ఇక జాన్ అబ్రహం, షారుక్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ తో సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పఠాన్ సినిమాకు 33 రోజుల్లో ఓవర్సీస్ లో రూ. 385 కోట్లు వరకు రాబట్టింది.

బాహుబలి 2 రికార్డుకు ఎంత రావాలంటే..

బాహుబలి 2 రికార్డుకు ఎంత రావాలంటే..

ఆదిత్య చోప్రా యూనివర్స్ లో భాగంగా వచ్చిన షారుక్ ఖాన్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ మూవీ పఠాన్ 33 రోజుల్లో రూ. 525.61 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. అందులో హిందీ వెర్షన్ కు మాత్రమే రూ. 507.45 కోట్లు నెట్ వచ్చింది. అంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి 2 హిందీ వెర్షన్ ఫుల్ రన్ లో సాధించిన రూ. 511 కోట్ల రికార్డుకు దగ్గరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా రూ. 3.70 కోట్లు రాబట్టగలిగితే బాహుబలి 2 రికార్డును దాటి మొదటి స్థానానికి చేరుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X