Pathaan 48 Days Collections: కొనసాగుతున్న పఠాన్ కలెక్షన్ల సునామీ.. మొత్తం వసూళ్లు ఎంతంటే?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా పఠాన్. సుమారు ఐదేళ్ల తర్వాత వచ్చిన షారుక్ ఖాన్ సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినవిధంగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలవడమే కాకుండా భారీ రెస్పాన్స్ అందుకుంది. గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణెతో నాలుగోసారి షారుక్ జంటగా నటించిన ఈ చిత్రానికి విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇలా వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న పఠాన్ సినిమా 48వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాలు చూస్తే..

 సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో..

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో..

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. ఎంతో కాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు షారుక్. సుమారు 80కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. ఇలా సుధీర్ఘకాలంగా సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న షారుక్ ఖాన్ చివరిగా 2018లో జీరో సినిమాతో ఫ్లాప్ చూశాడు. తాజాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన పఠాన్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు.

ప్రీరిలీజ్ బిజినెస్..

ప్రీరిలీజ్ బిజినెస్..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాద్ షా గా రాణిస్తున్న షారుక్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటన, యాక్షన్ స్టంట్స్, కామెడీకి ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే పఠాన్ సినిమాపై మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే పఠాన్ సినిమా హక్కులకు హై రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. బిజినెస్ కు తగినట్లుగా పఠాన్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 8000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

 7వ వారం కలెక్షన్స్..

7వ వారం కలెక్షన్స్..

హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగిన పఠాన్ చిత్రంలో షారుక్, దీపికా పదుకొణె కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఇప్పటికీ విడుదలై 7 వారాలు పూర్తి కావొస్తుంది. అయితే కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కావట్లేదు పఠాన్. ఈ క్రమంలో పఠాన్ చిత్రానికి ఈ వీకెండ్ లోని శనివారం రూ. 60 లక్షలు, కలెక్ట్ చేయగా.. 48వ రోజు అయిన ఆదివారం నాడు రూ. 80 లక్షలు, సోమవారం రోజున రూ. 30 లక్షలు వసూళ్లు సాధించింది.

48 రోజుల్లో కలిపి వసూళ్లు..

48 రోజుల్లో కలిపి వసూళ్లు..

బాలీవుడ్ బాద్ షా షారూక్, దీపిక, జాన్ అబ్రహం నటించిన 'పఠాన్' సినిమాకు ఓవరాల్‌గా మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. 48 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 539.74 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 18.54 కోట్లు నెట్ దక్షిణాది భాషల నుంచి వసూళు కాగా.. రూ. 521.20 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సినిమాకు రూ. 1044.50 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్ లో ఎలా ఉందంటే..

ఓవర్సీస్ లో ఎలా ఉందంటే..

పఠాన్ సినిమాలో తన విలనిజంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ప్రతి సన్నివేశంలో ఇంటెన్సిటీ చూపిస్తూ స్ట్రాంగ్ విలన్ అని నిరూపించుకున్నాడు. ఇక జాన్ అబ్రహం, షారుక్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ తో సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పఠాన్ సినిమాకు 48 రోజుల్లో ఓవర్సీస్ లో రూ. 391.10 కోట్లు వరకు రాబట్టింది. ఇలా 48వ రోజు కూడా పఠాన్ సినిమా రూ. కోటికిపైగా వసూళు చేసి సత్తా చాటింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X