Pathaan 49 Days Collections: పఠాన్ కు 49వ రోజు అలాంటి కలెక్షన్స్.. లాభం ఎంతో తెలిస్తే!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణె నాలుగోసారి జంటగా నటించిన చిత్రమే పఠాన్. యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన పఠాన్ సినిమా ఇప్పటికీ రూ. 1044 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ తో అదరగొడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు 49వ రోజు అంటే 7 వారాల వసూళ్ల విషయంలోకి వెళితే..

బిగ్ కమ్ బ్యాక్ హిట్..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, జాన్ అబ్రహం హీరో అండ్ విలన్ గా అదరగొట్టిన సినిమా పఠాన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలీంస్ పై ఆదిత్య చోప్రా పఠాన్ మూవీని నిర్మించారు. 2018లో జీరో సినిమాతో ఫ్లాప్ చూసిన షారుక్ ఖాన్ కు ఈ సినిమా భారీ కమ్ బ్యాక్ హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతో కాలంగా రాణిస్తున్న అగ్ర హీరో షారుక్ ఖాన్ విపరీతమై ఫ్యాన్ బేస్ సంపాందించుకున్నాడు. దీంతో పఠాన్ సినిమాపై ఆది నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. బిజినెస్ కు తగినట్లుగా పఠాన్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 8000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

49వ రోజు కలెక్షన్స్..
క్రేజీ స్టార్స్ కలిసి నటించిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. ఇక ఈ చిత్రంలో షారుక్, దీపికా పదుకొణె కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. పఠాన్ మూవీ ఇప్పటికీ విడుదలై 7 వారాలు పూర్తి చేసుకుంది. అయితే కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కావట్లేదు పఠాన్. ఈ క్రమంలో పఠాన్ చిత్రానికి 49వ రోజు రూ. 20 నుంచి 30 లక్షల వరకు వసూళైనట్లు తెలుస్తోంది.

49 రోజుల్లో కలిపి వసూళ్లు..
షారూఖ్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కలయికలో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. 49 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 545 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 525 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సినిమా రూ. 1050 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్ లో ఎలా ఉందంటే..
షారూఖ్ ఖాన్ హీరోగా చేసిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగా విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా పఠాన్ సినిమాకు 49 రోజుల్లో ఓవర్సీస్ లో రూ. 395 కోట్లు వరకు రాబట్టింది. అంటే ఓవర్సీస్స లో 49వ ఒక్క రోజే సుమారుగా రూ. 2 నుంచి 3 లక్షల వరకు కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రూ. 260 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ రూ. 285 కోట్లు లాభాలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











