Pathaan 50 Days Collections: పఠాన్ వసూళ్ల ప్రభంజనం.. ఏకంగా 30 రికార్డ్స్ సాధించిన తొలి సినిమాగా గుర్తింపు!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా పఠాన్. సుమారు ఐదేళ్ల తర్వాత వస్తున్న షారుక్ ఖాన్ సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినవిధంగా జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది పఠాన్ మూవీ. గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణెతో నాలుగోసారి షారుక్ జంటగా నటించిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 50 రోజులు పూర్తి చేసుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ అనేక థియేటర్లలో ప్రదర్శించబడుతున్న పఠాన్ 50వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

80కిపైగా చిత్రాల్లో..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. ఎంతో కాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు షారుక్. సుమారు 80కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. ఖాన్ త్రయంలో ఒకరిగా సుధీర్ఘ కాలంగా సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న షారుక్ ఖాన్ చివరిగా 2018లో జీరో సినిమాతో ఓటమి చూశాడు. అయితే తాజాగా పఠాన్ తో మాత్రం వరల్డ్ వైడ్ గా సాలిడ్ హిట్ కొట్టాడు.

ప్రీరిలీజ్ బిజినెస్..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాద్ షా గా రాణిస్తున్న షారుక్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటన, యాక్షన్ స్టంట్స్, కామెడీకి ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే పఠాన్ సినిమాపై మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్లుగానే పఠాన్ సినిమా హక్కులకు హై రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. బిజినెస్ కు తగినట్లుగా పఠాన్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

50వ రోజు వచ్చింది..
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా, అషుతోష్ రాణా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన సినిమానే పఠాన్. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు కలెక్ట్ అవుతున్నాయి. అయితే పఠాన్ చిత్రం బుధవారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఈ సినమా వరల్డ్ థియేటర్స్ లో దూకుడుగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో పఠాన్ సినిమాకు 50వ రోజు రూ. 25 లక్షల వరకు వసూళు అయినట్లు ట్రెడ్ వర్గాలు చెబుతున్నాయి.

50 రోజుల్లో కలెక్ట్ చేసింది..
హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగిన పఠాన్ చిత్రంలో షారుక్, దీపికా పదుకొణె కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా ఇప్పటికీ విడుదలై 7 వారాలు పూర్తి అయింది. ఇప్పుడు 8వ వారంలోకి ఎంటర్ అవుతోంది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కావట్లేదు. ఈ క్రమంలో పఠాన్ చిత్రానికి 50 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 540.38 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలైంది. ఇందులో రూ. 521.75 కోట్లు హిందీ బెల్ట్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రూ. రూ. 1050 కోట్లకుపైగా గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది.

ఓవర్సీస్ లో ఎలా ఉందంటే..
పఠాన్ సినిమాలో తన విలనిజంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ప్రతి సన్నివేశంలో ఇంటెన్సిటీ చూపిస్తూ స్ట్రాంగ్ విలన్ అని నిరూపించుకున్నాడు. ఇక జాన్ అబ్రహం, షారుక్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ తో సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పఠాన్ సినిమాకు 50 రోజుల్లో ఓవర్సీస్ లో 58 మిలియన్ యూఎస్ డాలర్స్ (రూ. 395 కోట్లు) వరకు రాబట్టింది.
ఏకంగా 30 రికార్డ్స్..
ఆదిత్య చోప్రా యూనివర్స్ లో భాగంగా వచ్చిన షారుక్ ఖాన్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్ మూవీ పఠాన్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ ఇండియాలో 800 థియేటర్లతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్ లో మొత్తంగా 135 సెంటర్లలో సక్సెస్ ఫుల్ గా స్క్రీనింగ్ జరుగుతోంది. ఇక ఈ సినిమా ఇప్పటి వరకు ఏకంగా 30 రికార్డ్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో హైయెస్ట్ ఓపెనింగ్ చిత్రంగా, వరల్డ్ వైడ్ గా 200, 300, 400 కోట్ల క్లబ్ లో ఫాస్ట్ గా చేరిన సినిమాగా, ఇండియాలో 500 కోట్లు నెట్ కలెక్ట్ చేసిన హిందీ సినిమాగా, యూకేలో భారీ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ మూవీగా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా టాప్ గ్రాసర్ మూవీగా ఇలా మొత్తంగా 30 రికార్డ్స్ సాధించినట్లు పలు సైట్స్ చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











