Pathaan 51 Days Collections: తగ్గుముఖం పట్టిన పఠాన్ వసూళ్లు.. లక్షల్లో కలెక్షన్స్.. లాభాలు ఎంతంటే?
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. ఎంతో కాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు షారుక్. సుమారు 80కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. అంతేకాకుండా ఎంతో మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఉంది. ఇక ఈ బాలీవుడ్ బాద్ షా సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో చూస్తుంటారు. షారుక్ ఖాన్ ఇటీవల 'పఠాన్'గా వచ్చిన విషయం తెలిసిందే. జనవరి 25న విడుదలైన ఈ సినిమా 51 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!

ఆ సినిమాతో ప్లాప్..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, జాన్ అబ్రహం హీరో అండ్ విలన్ గా అదరగొట్టిన సినిమా పఠాన్. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీకి యాక్షన్ సినిమాల డైరెక్టర్ గా పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలీంస్ పై ఆదిత్య చోప్రా పఠాన్ మూవీని నిర్మించారు. 2018లో జీరో సినిమాతో ఫ్లాప్ చూసిన షారుక్ ఖాన్ కు ఈ సినిమా భారీ కమ్ బ్యాక్ హిట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు.

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నస్టార్ హీరో షారుక్ ఖాన్ విపరీతమై ఫ్యాన్ బేస్ సాధించుకున్నాడు. దీంతో పఠాన్ సినిమాపై ఆది నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఇండియాలో 5500 థియేటర్లు కాగా.. ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్ లలో మొత్తంగా 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

51వ రోజు కలెక్షన్స్..
క్రేజీ స్టార్స్ కలిసి నటించిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. ఇక ఈ చిత్రంలో షారుక్, దీపికా పదుకొణె కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీ స్థాయిలోనే వస్తున్నాయి. పఠాన్ మూవీ ఇప్పటికీ విడుదలై 7 వారాలు పూర్తి చేసుకుంది. అయితే కలెక్షన్స్ రాబట్టడంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కావట్లేదు పఠాన్. ఈ క్రమంలో పఠాన్ చిత్రానికి 51వ రోజు రూ. 15 లక్షల వరకు వసూళైనట్లు తెలుస్తోంది.

51 రోజుల్లో కలిపి వసూళ్లు..
షారూక్ ఖాన్ - సిద్దార్థ్ ఆనంద్ కలయికలో రూపొందిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి కలెక్షన్లు వస్తున్నాయి. 51 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 541.50 కోట్లు నెట్ వసూలైంది. ఇందులో రూ. 522 కోట్లు హిందీ బెల్ట్ ద్వారా రాగా రూ. 18.54 కోట్లు సౌత్ భాషల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సినిమా రూ. 1046.50 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ రూ. 1050 కోట్ల గ్రాస్ తో క్లోజ్ అవ్వనున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఓవర్సీస్ లో ఎలా ఉందంటే..
షారూక్ ఖాన్ హీరోగా చేసిన 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లుగా విదేశాల్లో కూడా ఈ సినిమా భారీ స్పందనను సొంతం చేసుకుంది. అలాగే, కలెక్షన్లను కూడా భారీ స్థాయిలోనే రాబడుతూ దూసుకెళ్తోంది. ఫలితంగా పఠాన్ సినిమాకు 51 రోజుల్లో ఓవర్సీస్ లో రూ. 392 కోట్లు వరకు రాబట్టింది. అంటే ఓవర్సీస్ లో 51వ ఒక్క రోజే సుమారుగా రూ. 2 నుంచి 3 లక్షల వరకు కలెక్షన్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రూ. 260 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ మూవీ రూ. 281.5 కోట్లు లాభాలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











