Pathaan Day 11 Collections: వీకెండ్ లో పఠాన్ బీభత్సం.. 1000 కోట్ల వైపుగా వసూళ్లు.. మరో రికార్డ్!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. ఎంతో కాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు షారుక్. సుమారు 80కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. అంతేకాకుండా ఎంతో మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఉంది. ఇక ఈ బాలీవుడ్ బాద్ షా సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. షారుక్ ఖాన్ తాజాగా 'పఠాన్'గా వచ్చిన విషయం తెలిసిందే. జనవరి 25న విడుదలైన ఈ సినిమా 11 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

చాలా కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నస్టార్ హీరో షారుక్ ఖాన్ విపరీతమై ఫ్యాన్ బేస్ సాధించుకున్నాడు. దీంతో పఠాన్ సినిమాపై ఆది నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఇండియాలో 5500 థియేటర్లు కాగా.. ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్ లలో మొత్తంగా 8000లకు పైగా థియేటర్లలో అట్టరహాసంగా విడుదల అయింది.

హిందీ ఆక్యుపెన్సీ డీటెల్స్..

హిందీ ఆక్యుపెన్సీ డీటెల్స్..

బాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ పఠాన్. ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా నమోదు అయ్యాయి. ఈ క్రమంలో పఠాన్ 11వ రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు పరిశీలిస్తే.. ముంబైలో 15.67 శాతం, ఢిల్లీలో 17.67 శాతం, పూణె 19 శాతం, బెంగళూరు 41 శాతం, హైదరాబాద్ 36.67 శాతం, కోల్‌కతాలో 30.33 శాతం, ఆహ్మదాబాద్ 7.67 శాతం, చెన్నైలో 46 శాతం, సూరత్‌లో 7 శాతం, జైపూర్ 13 శాతం, భోపాల్ లో 18 శాతం, లక్నోలో 9.33 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.

తెలుగు ఆక్యుపెన్సీ వివరాలు..

తెలుగు ఆక్యుపెన్సీ వివరాలు..

యశ్ రాజ్ ఫిలీం బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంలో మరో ఏజెంట్ టైగర్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆకట్టుకున్నాడు. సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించింది పది నిమిషాలు అయినా అభిమానులకు ఐట్రీట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పఠాన్ 11వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 23.67 శాతం, విజయవాడలో 20.67 శాతం, గుంటూరులో 9.67 శాతం, వైజాగ్‌లో 36.67 శాతం, కాకినాడలో 6.33 శాతం, నెల్లూరులో అతి తక్కువగా 5 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

 పఠాన్ 11వ రోజు కలెక్షన్స్..

పఠాన్ 11వ రోజు కలెక్షన్స్..

హై ఆక్టెన్ యాక్షన్ తో, కామెడీతో తనదైన స్టైల్ లో షారుక్ ఖాన్ ఆకట్టుకున్న పఠాన్ సినిమాలో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె తన హై ఓల్టేజ్ గ్లామర్ తో సినిమా మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోయింది. అయితే మొన్న వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ తగ్గిన మళ్లీ వీకెండ్ లో పుంజుకుంది. దీంతో పఠాన్ సినిమాకు 11వ రోజు రూ. 23 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి.

 11 రోజుల్లో వచ్చిన వసూళ్లు..

11 రోజుల్లో వచ్చిన వసూళ్లు..

ఇండియా మాజీ రా ఏజెంట్ గా పవర్ ఫుల్ విలన్ పాత్రలో జాన్ అబ్రహం అదరగొట్టాడు. ప్రతినాయకుడిగా జాన్ అబ్రహం యాక్టింగ్, స్టంట్స్ కు విశేషమై రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా పఠాన్ సినిమా 11 రోజుల్లో రూ. 401.15 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే పఠాన్ సినిమా ఇప్పటికే రూ. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని ఊహించని రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 11వ రోజు వసూళ్లతో ఆ గ్రాస్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే మరికొన్ని రోజుల్లో రూ. 1000 కోట్ల గ్రాస్ అందుకోని రికార్డ్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X