Pathaan Day 14 Collections: తగ్గేదేలే అంటున్న షారుక్ 'పఠాన్' వసూళ్లు.. 14వ రోజు అన్ని కోట్లు ఏంటీ సామీ!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణె నాలుగోసారి జంటగా నటించిన చిత్రమే పఠాన్. యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన పఠాన్ పదమూడు రోజుల్లో రూ. 437 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో యాక్షన్ స్పై థ్రిల్లర్ పఠాన్ సినిమా పద్నాలుగో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

హిందీ చిత్ర పరిశ్రమలో ఎంతో కాలంగా రాణిస్తున్న అగ్ర హీరో షారుక్ ఖాన్ విపరీతమై ఫ్యాన్ బేస్ సంపాందించుకున్నాడు. దీంతో పఠాన్ సినిమాపై ఆది నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఇండియాలో 5500 థియేటర్లు కాగా.. ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్ లలో మొత్తంగా 8000లకు పైగా థియేటర్లలో అట్టరహాసంగా విడుదల అయింది.

పఠాన్ హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

పఠాన్ హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

బాలీవుడ్ పాపులర్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ పఠాన్. ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా నమోదు అయ్యాయి. ఈ క్రమంలో పఠాన్ 14వ రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు పరిశీలిస్తే.. ముంబైలో 6.33 శాతం, ఢిల్లీలో 8.33 శాతం, పూణె 6.67 శాతం, బెంగళూరు 22.33 శాతం, హైదరాబాద్ 26.67 శాతం, కోల్‌కతాలో 17.67 శాతం, ఆహ్మదాబాద్ 5 శాతం, చెన్నైలో 24.67 శాతం, సూరత్‌లో 7 శాతం, జైపూర్ 10.33 శాతం, భోపాల్ లో 16.67 శాతం, లక్నోలో 4.33 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషించాయి.

 షారుక్ సినిమా తెలుగు ఆక్యుపెన్సీ డీటెల్స్..

షారుక్ సినిమా తెలుగు ఆక్యుపెన్సీ డీటెల్స్..

హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలీం బ్యానర్ పై ఆదిత్య చోప్రా రూపొందించిన షారుక్ ఖాన్ పఠాన్ సినిమాలో మరో ఏజెంట్ టైగర్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆకట్టుకున్నాడు. సల్మాన్ గెస్ట్ రోల్ లో కనిపించింది పది నిమిషాలు అయినా అభిమానులకు ఐట్రీట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పఠాన్ 14వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 16.67 శాతం, బెంగళూరులో 96 శాతం, విజయవాడలో 25.33 శాతం, గుంటూరులో 7 శాతం, వైజాగ్‌లో 37.33 శాతం, కాకినాడలో 7.67 శాతం, నెల్లూరులో అతి తక్కువగా 4 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

పఠాన్ 14వ రోజు వసూళ్లు..

పఠాన్ 14వ రోజు వసూళ్లు..

హై ఆక్టెన్ యాక్షన్ లో కొంత కామెడీతో మిక్స్ చేసి తనదైన స్టైల్ లో షారుక్ ఖాన్ ఆకట్టుకున్న సినిమా పఠాన్. అలాగే ఇందులో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె తన హై ఓల్టేజ్ గ్లామర్ తో సినిమా మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. దీంతో పఠాన్ సినిమాకు 14వ రోజు రూ. 7.80 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి.

14 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇలా..

14 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇలా..

ఇండియా మాజీ రా ఏజెంట్ గా పవర్ ఫుల్ విలన్ పాత్రలో జాన్ అబ్రహం అదరగొట్టాడు. ప్రతినాయకుడిగా జాన్ అబ్రహం యాక్టింగ్, స్టంట్స్ కు విశేషమై రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా పఠాన్ సినిమా 14 రోజుల్లో రూ. 446.25 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే పఠాన్ సినిమా ఇప్పటికే రూ. 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని ఊహించని రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 14వ రోజు వసూళ్లతో ఆ గ్రాస్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే అతి తక్కువ రోజుల్లో రూ. 1000 కోట్ల గ్రాస్ అందుకోని రికార్డ్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X