Pathaan Day 16 Collections: బాక్సాఫీస్ వద్ద షారుక్ యాక్షన్ బీభత్సం.. త్వరలోనే ఆ క్లబ్ లోకి 'పఠాన్'!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. సుధీర్ఘకాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నాడు షారుక్ ఖాన్. హిందీ చిత్రపరిశ్రమలో సుమారు 80కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. అంతేకాకుండా ఎంతో మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఉంది. అయితే షారుక్ ఖాన్ సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా తాజాగా 'పఠాన్' చిత్రాన్ని కానుకగా అందించాడు. జనవరి 25న విడుదలైన ఈ సినిమా 16 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం!

 ప్రీరిలీజ్ బిజినెస్ ఇలా..

ప్రీరిలీజ్ బిజినెస్ ఇలా..

బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో చాలా కాలంగా రాణిస్తున్న స్టార్ హీరో ఖాన్ త్రయంలో ఒకరు అయిన షారుక్ ఖాన్ విపరీతమై ఫ్యాన్ బేస్ సంపాందించుకున్నాడు. దీంతో పఠాన్ సినిమాపై ఆది నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 8000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

హిందీ ఆక్యుపెన్సీ డిటెల్స్..

హిందీ ఆక్యుపెన్సీ డిటెల్స్..

ఆదిత్య చోప్రా యూనివర్స్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పఠాన్. ఇప్పటికే ఈ యూనివర్స్ లో సల్మాన్ ఖాన్ తో టైగర్, హృతిక్ రోషన్ తో వార్ సినిమాలు రాగా షారుక్ తో పఠాన్ తెరకెక్కింది. ఈ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. విజయవంతంగా దూసుకుపోతున్న పఠాన్ 16వ రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు పరిశీలిస్తే.. ముంబైలో 6.67 శాతం, ఢిల్లీలో 6.67 శాతం, పూణె 6 శాతం, బెంగళూరు 21.33 శాతం, హైదరాబాద్ 25.67 శాతం, కోల్‌కతాలో 17 శాతం, ఆహ్మదాబాద్ 5 శాతం, చెన్నైలో 21.33 శాతం, సూరత్‌లో 5.67 శాతం, జైపూర్ 7.33 శాతం, చంఢీగర్ లో 6.67 శాతం, భోపాల్ లో 16.67 శాతం, లక్నోలో 3.33 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

పఠాన్ తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే..

పఠాన్ తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే..

మిషన్ ఇంపాజిబుల్ వంటి హాలీవుడ్ పాపులర్ సిరీస్ తరహాలో తెరకెక్కిన హిందీ చిత్రమే పఠాన్. ఈ సినిమాలో షారుక్ ఖాన్ యాక్షన్ స్టంట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. అలాగే సల్మాన్ ఖాన్ ఎంట్రీ ప్రేక్షకులకు మంచి విందును అందించింది. దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పఠాన్ 16వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 14 శాతం, బెంగళూరులో 96 శాతం, విజయవాడలో 24 శాతం, గుంటూరులో 6.67 శాతం, వైజాగ్‌లో 38.33 శాతం, కాకినాడలో 8 శాతం, నెల్లూరులో అతి తక్కువగా 2 శాతం ఆక్యుపెన్సీని రాబట్టగలిగింది.

పఠాన్ 16వ రోజు వసూళ్లు..

పఠాన్ 16వ రోజు వసూళ్లు..

హై ఆక్టెన్ యాక్షన్ గా సాగే పఠాన్ చిత్రంలో తనదైన కామెడీతో అలరించాడు షారుక్ ఖాన్. షారుక్ కు ధీటుగా తన అందంతో మెస్మరైజ్ చేసింది గ్లామరస్ బ్యూటి దీపికా పదుకొణె. ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే నెలకొన్నాయి. దీంతో తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. దీంతో పఠాన్ సినిమాకు 16వ రోజు రూ. 6 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

16 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇలా..

16 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇలా..

దేశ భక్తుడిని కరుడు గట్టిన దేశ ద్రోహిగా ఎలా మారాడో చూపించిన యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ మూవీ పఠాన్. ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్ మ్యాచో హీరో జాన్ అబ్రహం అదరగొట్టాడు. ప్రతి సన్నివేశంలో ఇంటెన్సిటీ చూపిస్తూ స్ట్రాంగ్ విలన్ అని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే పఠాన్ సినిమాకు 16 రోజుల్లో రూ. 458.95 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలా చూసుకుంటే త్వరలో రూ. 500 కోట్ల షేర్ కలెక్షన్స్ క్లబ్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X