Pathaan Day 17 Collections: ఫ్రైడే రోజున షారుక్ సినిమాకు దెబ్బ.. ఎంత రాబట్టింది అంటే?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్న సినిమా పఠాన్. వాళ్ల అంచనాలకు మించిన ట్రీట్ ఇచ్చాడు ఈ అగ్ర హీరో. గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణెతో నాలుగోసారి షారుక్ జంటగా నటించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా భారీ అంచనాలతో రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పఠాన్ సినిమా 17వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

బాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో సుధీర్ఘకాలంగా రాణిస్తున్న ఖాన్ త్రయంలో ఒకరు అయిన షారుక్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే పఠాన్ సినిమాపై మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది.

దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 8000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

హిందీ చిత్రపరిశ్రమలో యాక్షన్ చిత్రాలకు మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ సినిమాకు అభిమానులు, ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. దీంతో ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది.

ఈ క్రమంలో పఠాన్ 17వ రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు పరిశీలిస్తే.. ముంబైలో 6.33 శాతం, ఢిల్లీలో 6.33 శాతం, పూణె 5.67 శాతం, బెంగళూరు 11 శాతం, హైదరాబాద్ 23.33 శాతం, కోల్‌కతాలో 16 శాతం, ఆహ్మదాబాద్ 5 శాతం, చెన్నైలో 33.67 శాతం, సూరత్‌లో 5.67 శాతం, జైపూర్ 4.67 శాతం, చంఢీగర్ లో 4.67 శాతం, భోపాల్ లో 16.33 శాతం, లక్నోలో 2.33 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు ఆక్యుపెన్సీ డీటెల్స్..

తెలుగు ఆక్యుపెన్సీ డీటెల్స్..

హాలీవుడ్ యాక్షన్ సిరీస్ ల వంటి తరహాలో తెరకెక్కిన బాలీవుడ్ బాద్ షా చిత్రమే పఠాన్. ఈ సినిమాలో షారుక్ ఖాన్ యాక్షన్ స్టంట్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. అలాగే సల్మాన్ ఖాన్ ఎంట్రీ ప్రేక్షకులకు ఐ ట్రీట్ అందించింది. దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

ఈ క్రమంలో పఠాన్ 17వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 4 శాతం, విజయవాడలో 4.50 శాతం, గుంటూరులో 10 శాతం, వైజాగ్‌లో 31 శాతం, కాకినాడలో 5 శాతం, నెల్లూరులో అతి తక్కువగా 2 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసినట్లు సమాచారం.

పఠాన్ 17వ రోజు వసూళ్లు..

పఠాన్ 17వ రోజు వసూళ్లు..

హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగిన పఠాన్ చిత్రంలో షారుక్, దీపికా పదుకొణె కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బేషరమ్ రంగ్ సాంగ్ లో దీపికా గ్లామర్ మెస్మరైజ్ చేసింది. ఇక షారుక్ అభిమానలు ఆయన నుంచి ఎలాంటి సినిమాను కావాలనుకున్నారో అలా పఠాన్ ఉండేసరికి కలెక్షన్ల పోటు ఎత్తుతోంది.

అలా తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. దీంతో పఠాన్ సినిమాకు 17వ రోజు రూ. 5 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

 17 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇలా..

17 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇలా..

తన విలనిజంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ప్రతి సన్నివేశంలో ఇంటెన్సిటీ చూపిస్తూ స్ట్రాంగ్ విలన్ అని నిరూపించుకున్నాడు. ఇక జాన్ అబ్రహం, షారుక్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి.

ఇన్ని ప్లస్ పాయింట్స్ తో సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పఠాన్ సినిమాకు 17 రోజుల్లో రూ. 463.90 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే మిగతా రోజుల కలెక్షన్స్ తో పోల్చుకుంటే శుక్రవారం రోజున పఠాన్ కు కాస్తా వసూళ్లు తగ్గి షారుక్ కు దెబ్బ తగిలినట్లుగా చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X