Pathaan Day 2 Collections: షారుక్ బాక్సాఫీస్ బీభత్సం.. 2 రోజుల్లో రూ. 200 కోట్లు

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సుధీర్ఘంగా కాలంలో హిందీ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నాడు. ఆయన సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు ఆయన నటించిన తాజా సినిమా పఠాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్, హాట్ బ్యూటి దీపిక పదుకొణె మరోసారి జంటగా నటించిన చిత్రం పఠాన్. యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. పఠాన్ విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లు సాధించగా.. రెండో రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

 ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమాపో ప్రారంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు దాదాపు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని దాదాపుగా 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

2వ రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..

2వ రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో అలరించిన షారుక్ ఖాన్ పఠాన్ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇక పఠాన్ రెండో రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 59.67 శాతం, బెంగళూరులో 58.67 శాతం, విజయవాడలో 49.33 శాతం, వరంగల్‌లో 54.33 శాతం, గుంటూరులో 72.33 శాతం, వైజాగ్‌లో 43.67 శాతం, కాకినాడలో 45 శాతం, నెల్లూరులో 40.67 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

 డే 2 హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

డే 2 హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వచ్చింది షారుక్ ఖాన్ పఠాన్. ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి టాక్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ బాగా వసూలు అవుతున్నాయి. ఈ క్రమంలో పఠాన్ రెండో రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు చూస్తే.. ముంబైలో 65.33 శాతం, ఢిల్లీలో 78.67 శాతం, పూణె 61.33 శాతం, బెంగళూరు 81.67 శాతం, హైదరాబాద్ 72.67 శాతం, కోల్‌కతాలో 83.67 శాతం, ఆహ్మదాబాద్ 27.33 శాతం, సూరత్‌లో 27.33 శాతం, జైపూర్ 63.33 శాతం, భోపాల్ లో 48 శాతం, లక్నోలో 64.67 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

 పఠాన్ రెండో రోజు కలెక్షన్స్..

పఠాన్ రెండో రోజు కలెక్షన్స్..

హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న పఠాన్ సినిమాలో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె హై ఓల్టేజ్ గ్లామర్ ఒలకబోసిందని టాక్ వినిపిస్తోంది. ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది పఠాన్ సినిమా. ఇదే కంటిన్యూ అవనుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పఠాన్ సినిమాకు రెండో రోజు.. రూ. 68 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.

2 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

2 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంలో ప్రతినాయకుడిగా మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటించాడు. విలన్ గా జాన్ అబ్రహం నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే పఠాన్ సినిమా 2 రోజుల్లో రూ. 125 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పఠాన్ సినిమా తొలి రోజు మొత్తంగా రూ. 57 కోట్లు (హిందీ వెర్షన్ రూ. 55 కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 1.5 కోట్లు, తమిళం రూ. 50 లక్షలు) వసూళు చేసింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 190 నుంచి 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబడుతుందని అంచనా వేశారు. ఇలా అయితే రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డుకెక్కనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X