Pathaan Day 20 Collections: ఆగని పఠాన్ కలెక్షన్ల సునామీ.. ఇంకా 7 కోట్లు వస్తే ఆ రికార్డ్!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సినిమా పఠాన్. దాదాపుగా ఐదేళ్ల తర్వాత వస్తున్న షారుక్ ఖాన్ సినిమా కావడంతో అభిమానులు భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు తగినవిధంగా ఎట్టకేలకు జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది పఠాన్ మూవీ. ఇక గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణెతో నాలుగోసారి షారుక్ జంటగా నటించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తోంది. ఇలా వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న పఠాన్ సినిమా 20వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

ఐదేళ్ల తర్వాత..
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. ఎంతో కాలంగా సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు షారుక్. సుమారు 80కి పైగా చిత్రాల్లో యాక్ట్ చేసిన కింగ్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. ఇలా సుధీర్ఘకాలంగా సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న షారుక్ ఖాన్ చివరిగా 2018లో జీరో సినిమాతో ఫ్లాప్ చూశాడు. తాజాగా ఐదేళ్ల తర్వాత పఠాన్ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు.

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సుధీర్ఘకాలంగా రాణిస్తున్న ఖాన్ త్రయంలో ఒకరు అయిన షారుక్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే పఠాన్ సినిమాపై మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు సుమారు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 8000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

థియేటర్ ఆక్యుపెన్సీ..
హిందీ చిత్రపరిశ్రమలో యాక్షన్ చిత్రాలకు మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ సినిమాకు అభిమానులు, ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. దీంతో ఈ సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో పఠాన్ 20వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ వివరాలు పరిశీలిస్తే.. ఉదయం 8.10 శాతం నమోదు కాగా మధ్యాహ్నం కాస్తా తగ్గి 7.86 శాతంగా ఉన్నట్లు తెలిసింది. ఇక సాయంత్రానికి పెరిగి 9.21 శాతం నమోదు అయినట్లు సమాచారం.

పఠాన్ 20వ రోజు వసూళ్లు..
హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా సాగిన పఠాన్ చిత్రంలో షారుక్, దీపికా పదుకొణె కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా బేషరమ్ రంగ్ సాంగ్ లో దీపికా గ్లామర్ మెస్మరైజ్ చేసింది. ఇక షారుక్ అభిమానలు ఆయన నుంచి ఎలాంటి సినిమాను కావాలనుకున్నారో అలా పఠాన్ ఉండేసరికి కలెక్షన్ల పోటు ఎత్తుతోంది. అలా తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. దీంతో పఠాన్ సినిమాకు 20వ రోజు రూ. 4.60 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

20 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇలా..
తన విలనిజంతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు మరో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం. ప్రతి సన్నివేశంలో ఇంటెన్సిటీ చూపిస్తూ స్ట్రాంగ్ విలన్ అని నిరూపించుకున్నాడు. ఇక జాన్ అబ్రహం, షారుక్ ఖాన్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ తో సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పఠాన్ సినిమాకు 20 రోజుల్లో రూ. 493.65 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ రానున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇంకొక రూ. 7 కోట్లు వస్తే రూ. 500 కోట్ల నెట్ కలెక్షన్స్ క్లబ్ లో చేరనుంది పఠాన్.


Click it and Unblock the Notifications











