twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pathaan Day 3 Collections: షాకింగ్.. తగ్గిన షారుక్ సినిమా వసూళ్లు.. 3వ రోజు వచ్చింది అన్ని కోట్లే!

    |

    బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు కింగ్ ఖాన్ అయ్యాడు. సుధీర్ఘమైన ఆయన సినీ ప్రయాణంలో అశేషంగా అభిమానులను సంపాదించుకున్నాడు. దాదాపుగా 80కి పైగా చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. అంతేకాకుండా ఎంతో మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఉంది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత షారుక్ నుంచి వచ్చిన సినిమా పఠాన్. జనవరి 25న వరల్డ్ వైడ్ గా అట్టహాసంగా విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్స్ సునామీలో పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో పఠాన్ మూడో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే..

    ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

    ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

    హిందీ చిత్ర సీమలోని అగ్ర హీరోల్లో ఒకరైన షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పఠాన్'. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు ఒక రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు దాదాపుగా రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని దాదాపుగా 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

     డే 2 హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

    డే 2 హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

    బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి తదితర యాక్షన్ చిత్రాలనుతెరకెక్కించిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే పఠాన్. ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి టాక్ వస్తోంది. అదే జోరు రెండో కొనసాగించినా అనూహ్యంగా మూడో రోజు ఒక్కసారిగా వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. పఠాన్ మూడవ రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు చూస్తే.. ముంబైలో 17.67 శాతం, ఢిల్లీలో 24.33 శాతం, పూణె 15 శాతం, బెంగళూరు 45 శాతం, హైదరాబాద్ 33 శాతం, కోల్‌కతాలో 12 శాతం, ఆహ్మదాబాద్ 7.33 శాతం, చెన్నైలో 34 శాతం, సూరత్‌లో 9.33 శాతం, జైపూర్ 22 శాతం, భోపాల్ లో 26 శాతం, లక్నోలో 19.33 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

     3వ రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..

    3వ రోజు తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..

    దేశం కోసం ప్రాణాలకు తెగించి సైతం పోరాడే ఓ స్పై ఏజెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన షారుక్ ఖాన్ పఠాన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలీంస్ నిర్మించింది. ఇదిలా ఉంటే పఠాన్ 3వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 37 శాతం, విజయవాడలో 26.67 శాతం, వరంగల్‌లో 49.33 శాతం, గుంటూరులో 12 శాతం, వైజాగ్‌లో 32.67 శాతం, నిజామాబాద్ 14.33 శాతం, కాకినాడలో 16.67 శాతం, నెల్లూరులో 5.50 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. హిందీ ఆక్యుపెన్సీ లాగే తెలుగులోను చూసే ప్రజల సంఖ్య తగ్గినట్లు అర్థమవుతోంది.

    పఠాన్ 3వ రోజు వసూళ్లు..

    పఠాన్ 3వ రోజు వసూళ్లు..

    ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది పఠాన్ సినిమా. ఇదే కంటిన్యూ అవుతూ రెండో రోజు కూడా ఫస్ట్ డేకు మించి వసూళ్లు సాధించింది. కానీ మూడో రోజు మాత్రం రూ. 34.50 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు. అంటే తొలి రెండు రోజుల కంటే మూడో రోజు తక్కువగా నమోదు అయనట్లు తెలుస్తోంది.

     మొత్తం 3 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

    మొత్తం 3 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

    షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంలో ప్రతినాయకుడిగా పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం విలనిజం, దీపిక పదుకొణె గ్లామర్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాతో మళ్లీ బాలీవుడ్ సినిమా సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే అని తెలుస్తోంది. అయితే పఠాన్ సినిమా 3 రోజుల్లో రూ. 162 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇలా చూసుకుంటే మూడో రోజు తగ్గిన తర్వాత శని, ఆది వారాల్లో మాత్రం పఠాన్ కు బీభత్సమైన వసూళ్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    English summary
    Shahrukh Khan Deepika Padukone And Director Siddharth Anand Combination Movie Pathaan 3 Days Expected Box Office Collection Is Approximately Rs 162 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X