Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణె నాలుగోసారి జంటగా నటించిన చిత్రమే పఠాన్. యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన పఠాన్ మూడు రోజుల్లో రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో యాక్షన్ స్పై థ్రిల్లర్ పఠాన్ సినిమా నాలుగో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా 'పఠాన్'. జాన్ అబ్రహం విలన్ గా అదరొగొట్టిన ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ యాక్షన్ సినిమాకు దాదాపు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఇండియాలో 5500 థియేటర్లు కాగా.. ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్ లలో మొత్తంగా 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వచ్చింది షారుక్ ఖాన్ పఠాన్. ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి టాక్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ బాగా వసూలు అవుతున్నాయి. ఈ క్రమంలో పఠాన్ నాలుగో రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు చూస్తే.. ముంబైలో 37 శాతం, ఢిల్లీలో 43 శాతం, పూణె 37.67 శాతం, బెంగళూరు 32.33 శాతం, హైదరాబాద్ 47.33 శాతం, కోల్‌కతాలో 57 శాతం, ఆహ్మదాబాద్ 13.33 శాతం, చెన్నైలో 59 శాతం, సూరత్‌లో 12.67 శాతం, జైపూర్ 32.33 శాతం, భోపాల్ లో 32 శాతం, లక్నోలో 31.33 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.

తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..

తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో అలరించిన షారుక్ ఖాన్ పఠాన్ సినిమా 3 రోజుల్లో భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇక పఠాన్ 4వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 46 శాతం, విజయవాడలో 31 శాతం, వరంగల్‌లో 51.67 శాతం, గుంటూరులో 17 శాతం, వైజాగ్‌లో 34 శాతం, నిజమాబాద్ లో 13.67 శాతం, కాకినాడలో 18.33 శాతం, నెల్లూరులో 7 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

 పఠాన్ 4వ రోజు కలెక్షన్స్..

పఠాన్ 4వ రోజు కలెక్షన్స్..

హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న పఠాన్ సినిమాలో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె హై ఓల్టేజ్ గ్లామర్ ఒలకబోసిందని టాక్ వినిపిస్తోంది. ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. ఇక వీకెండ్ అయన శనివారం కూడా భారీ వసూళ్లు సాధించిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పఠాన్ సినిమాకు నాలుగో రోజు.. రూ. 55 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.

 4 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

4 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంలో ప్రతినాయకుడిగా మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటించాడు. విలన్ గా జాన్ అబ్రహం నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే పఠాన్ సినిమా 4 రోజుల్లో రూ. 221.75 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే పఠాన్ సినిమా మూడు రోజుల్లో రూ. 300కు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగా నాలుగో రోజు మరో రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా చూసుకుంటే పఠాన్ మూవీ 4 రోజుల్లో రూ. 400 కోట్లు కొల్లగొట్టనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X