Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
Pathaan Day 6 Collections: షారుక్ ప్రభంజనం.. కలెక్షన్స్ తగ్గినా సరికొత్తగా రికార్డుల మోత! వసూళ్లు ఎంతంటే?
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణె నాలుగోసారి జంటగా నటించిన చిత్రమే పఠాన్. బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి తదితర యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది.
విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన పఠాన్ ఐదు రోజుల్లో రూ. 250 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఈ నేపథ్యంలో యాక్షన్ స్పై థ్రిల్లర్ పఠాన్ సినిమా ఆరవ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..
ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ నటించిన తాజా సినిమా 'పఠాన్'. మరో మ్యాచో హీరో జాన్ అబ్రహం విలన్ గా అదరొగొట్టిన ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు ఓ రేంజ్లో డిమాండ్ ఏర్పడింది.
దీంతో ఈ యాక్షన్ సినిమాకు దాదాపు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఇండియాలో 5500 థియేటర్లు కాగా.. ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్ లలో మొత్తంగా 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..
యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వచ్చింది షారుక్ ఖాన్ పఠాన్. ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి టాక్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ బాగా వసూలు అవుతున్నాయి.
ఈ క్రమంలో పఠాన్ ఆరో రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు చూస్తే.. ముంబైలో 15.33 శాతం, ఢిల్లీలో 17 శాతం, పూణె 13.33 శాతం, బెంగళూరు 29 శాతం, హైదరాబాద్ 28.67 శాతం, కోల్‌కతాలో 32 శాతం, ఆహ్మదాబాద్ 7.33 శాతం, చెన్నైలో 21.67 శాతం, సూరత్‌లో 6.67 శాతం, జైపూర్ 19.33 శాతం, భోపాల్ లో 25 శాతం, లక్నోలో 15.33 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాల నిపుణులు తెలుపుతున్నారు.
తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ డీటెల్స్..
బాలీవుడ్ కండల వీరుడు, షారుక్ ఖాన్ బెస్ట్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో అలరించిన పఠాన్ సినిమా 5 రోజుల్లో అత్యధిక భారీ వసూళ్లు నమోదు చేసింది.
ఇక పఠాన్ 6వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 35 శాతం, విజయవాడలో 33.33 శాతం, వరంగల్‌లో 48 శాతం, గుంటూరులో 8.67 శాతం, వైజాగ్‌లో 36.67 శాతం, నిజమాబాద్ లో 6.33 శాతం, కాకినాడలో 9.67 శాతం, నెల్లూరులో 4.67 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.
పఠాన్ 6వ రోజు కలెక్షన్స్..
హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన షారుక్ ఖాన్ పఠాన్ సినిమాలో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె హై ఓల్టేజ్ గ్లామర్ ఒలకబోసిందని టాక్ వినిపిస్తోంది. ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి.
దీంతో తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. అయితే సోమవారం కారణంగా పఠాన్ సినిమాకు కాస్తా వసూళ్లు తగ్గాయి అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పఠాన్ సినిమాకు ఆరవ రోజు.. రూ. 23 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.
6 రోజుల్లో వచ్చింది ఎంతంటే?
షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంలో ప్రతినాయకుడిగా మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటించాడు. విలన్ గా జాన్ అబ్రహం నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే పఠాన్ సినిమా 6 రోజుల్లో రూ. 303.75 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అయితే పఠాన్ సినిమా 5 రోజుల్లో రూ. 250 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ సాధించగా.. ఆరో రోజు రూ. 303.75 కోట్లు కొల్లగొట్టి 3 వందల కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది. దీంతో వారం రోజులు కాకముందే ఈ క్లబ్ లో చేరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది పఠాన్ మూవీ.