twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pathaan Day 7 Collections: పఠాన్ ఊచకోత.. వర్కింగ్ డేస్ లోనూ తగ్గని కలెక్షన్స్.. నయా రికార్డుకు చేరువలో!

    |

    బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ తనదైన శైలీలో సినిమాలు చేస్తూ హిందీ చిత్రసీమకు బాద్ షాగా మారాడు. ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న షారుక్ ఖాన్ అశేష అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు. సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించిన షారుక్ ఖాన్ 14 ఫిలీం ఫేర్ అవార్డులను పొందాడు. అంతేకాకుండా ఎంతో మంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ కు ఉంది.

    అలా షారుక్ పరిచయం చేసిన ముద్దుగుమ్మల్లో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె ఒకరు. షారుక్ ఖాన్-దీపికా పదుకొణె కాంబినేషన్ లో వచ్చిన నాలుగో చిత్రం పఠాన్. వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న పఠాన్ ఏడో రోజు అంటే వారం రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా!

    ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

    ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు..

    హిందీ చిత్ర పరిశ్రమ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'పఠాన్'. మ్యాచో హీరో జాన్ అబ్రహం విలన్ గా ఆకట్టుకున్న ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది.

    దీంతో ఈ యాక్షన్ సినిమాకు దాదాపు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఇండియాలో 5500 థియేటర్లు కాగా.. ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్ లలో మొత్తంగా 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది.

    హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

    హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

    యాక్షన్ చిత్రాలకు మంచి పేరు ఉన్న దర్శకుల్లో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఒకరు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లరే షారుక్ ఖాన్ పఠాన్. ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి టాక్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ బాగా వసూలు అవుతున్నాయి.

    ఈ క్రమంలో పఠాన్ ఏడో రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు పరిశీలిస్తే.. ముంబైలో 11 శాతం, ఢిల్లీలో 13 శాతం, పూణె 9.33 శాతం, బెంగళూరు 24.33 శాతం, హైదరాబాద్ 27.33 శాతం, కోల్‌కతాలో 26.33 శాతం, ఆహ్మదాబాద్ 6 శాతం, చెన్నైలో 18.33 శాతం, సూరత్‌లో 8.33 శాతం, జైపూర్ 17 శాతం, భోపాల్ లో 23.33 శాతం, లక్నోలో 12 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

    తెలుగు వెర్షన్ లో ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే..

    తెలుగు వెర్షన్ లో ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే..

    ఏక్ థా టైగర్ సిరీస్ తో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆ పాత్రను కొనసాగిస్తూ సల్లూ భాయ్ గెస్ట్ రోల్ లో అలరించిన సినిమా పఠాన్. దీనికి 6 రోజుల్లో అత్యధికంగా భారీ వసూళ్లు నమోదు చేసింది.

    ఈ క్రమంలో పఠాన్ 7వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 34 శాతం, విజయవాడలో 19.33 శాతం, వరంగల్‌లో 51 శాతం, గుంటూరులో 9 శాతం, వైజాగ్‌లో 37 శాతం, నిజమాబాద్ లో 15.33 శాతం, కాకినాడలో 8 శాతం, నెల్లూరులో 6.33 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

    పఠాన్ 7వ రోజు కలెక్షన్స్..

    పఠాన్ 7వ రోజు కలెక్షన్స్..

    హై ఆక్టెన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న పఠాన్ సినిమాలో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె హై ఓల్టేజ్ గ్లామర్ ఒలకబోసిందని టాక్ వినిపిస్తోంది. ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి.

    దీంతో తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోతోంది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా పఠాన్ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. పఠాన్ సినిమాకు ఏడో రోజు.. రూ. 21 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.

    7 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

    7 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

    షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంలో ప్రతినాయకుడిగా మరో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నటించాడు. విలన్ గా జాన్ అబ్రహం నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే పఠాన్ సినిమా 7 రోజుల్లో అంటే వారంలో రూ. 328.25 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే పఠాన్ సినిమా ఇప్పటికే రూ. 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని ఊహించని రికార్డ్ సొంతం చేసుకుంది.

    అలాగే రూ. 300 కోట్ల షేర్ క్లబ్ లో కూడా చేరింది. ఇలా షారుక్ ఖాన్ పఠాన్ సినిమాకు కలెక్షన్స్ తగ్గేదే లే అంటూ పెరుగుతూనే ఉన్నాయి. చూస్తుంటే మరికొన్ని రోజుల్లో రూ. 1000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి మరో నయా రికార్డ్ నెలకొల్పేలా ఉంది.

    English summary
    Shahrukh Khan Deepika Padukone And Director Siddharth Anand Combination Movie Pathaan 7 Days Expected Box Office Collection Is Approximately Rs 328.25 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X