twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?

    |

    బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, గ్లామరస్ బ్యూటి దీపిక పదుకొణె నాలుగోసారి జంటగా నటించిన చిత్రం పఠాన్. యశ్ రాజ్ ఫిలీం బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకు యాక్షన్ చిత్రాలకు పేరొందిన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఎప్పటి నుంచో షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అయింది.

    విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన పఠాన్ బాక్సాఫీస్ ను ఊచకోత కోస్తున్నాడు. ఈ క్రమంలో యాక్షన్ స్పై థ్రిల్లర్ పఠాన్ సినిమా 9వ రోజు వసూళ్లు ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

    ప్రీరిలీజ్ బిజినెస్ డీటెల్స్..

    ప్రీరిలీజ్ బిజినెస్ డీటెల్స్..

    ఎంతో కాలంగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నస్టార్ హీరో షారుక్ ఖాన్ అశేష అభిమానగనాన్ని సంపాదించుకున్నాడు. దీంతో పఠాన్ సినిమాపై ప్రారంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఫలితంగా పఠాన్ మూవీ హక్కులకు అంతే రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది.

    దీంతో ఈ యాక్షన్ సినిమాకు దాదాపు రూ. 250 నుంచి రూ. 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఇండియాలో 5500 థియేటర్లు కాగా.. ఓవర్సీస్ లో మరో 2500 స్క్రీన్ లలో మొత్తంగా 8000లకు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయింది.

    హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

    హిందీ ఆక్యుపెన్సీ వివరాలు..

    బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ స్పై థ్రిల్లరే షారుక్ ఖాన్ పఠాన్. ఈ సినిమాకు తొలి రోజు నుంచి మంచి టాక్ వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ బాగా వసూలు అవుతున్నాయి.

    ఈ క్రమంలో పఠాన్ తొమ్మిదో రోజు హిందీ ఆక్యుపెన్సీ వివరాలు పరిశీలిస్తే.. ముంబైలో 10 శాతం, ఢిల్లీలో 8.67 శాతం, పూణె 8.33 శాతం, బెంగళూరు 21 శాతం, హైదరాబాద్ 25.33 శాతం, కోల్‌కతాలో 23.67 శాతం, ఆహ్మదాబాద్ 4.67 శాతం, చెన్నైలో 14.33 శాతం, సూరత్‌లో 7.33 శాతం, జైపూర్ 11 శాతం, భోపాల్ లో 18 శాతం, లక్నోలో 10 శాతం ఆక్యుపెన్సీ నమోదయిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.

    తెలుగులో ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే..

    తెలుగులో ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే..

    ఆదిత్య చోప్రా స్పై యూనివర్స్ గా తెరకెక్కిన షారుక్ ఖాన్ పఠాన్ చిత్రంలో టైగర్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించి అభిమానులకు ఐట్రీట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో పఠాన్ 9వ రోజు తెలుగు ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో 35.67 శాతం, విజయవాడలో 25.33 శాతం, వరంగల్‌లో 47.33 శాతం, గుంటూరులో 6.67 శాతం, వైజాగ్‌లో 34.33 శాతం, నిజమాబాద్ లో 6 శాతం, కాకినాడలో 6 శాతం, నెల్లూరులో అతి తక్కువగా 1 శాతం ఆక్యుపెన్సీని సాధించింది.

    పఠాన్ 9వ రోజు కలెక్షన్స్..

    పఠాన్ 9వ రోజు కలెక్షన్స్..

    హై ఆక్టెన్ యాక్షన్ తో, కామెడీతో తనదైన స్టైల్ లో షారుక్ ఖాన్ ఆకట్టుకున్న పఠాన్ సినిమాలో బ్యూటిఫుల్ దీపికా పదుకొణె తన హై ఓల్టేజ్ గ్లామర్ తో మూవీని నెకట్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఇక చాలా కాలం నుంచి షారుక్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో తొలి రోజు సూపర్ ఓపెనింగ్స్ సాధించిన పఠాన్ సినిమా అదే కంటిన్యూ చేస్తూ దూసుకుపోయింది. అయితే ఇప్పుడు మాత్రం పఠాన్ సినిమాకు కలెక్షన్స్ తగ్గుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. పఠాన్ సినిమాకు 9వ రోజు.. రూ. 15.50 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు.

    9 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

    9 రోజుల్లో వచ్చింది ఎంతంటే?

    కరుడు గట్టిన భారతదేశం ద్వేషిగా, ఎక్స్ రా ఏజెంట్ గా పవర్ ఫుల్ విలన్ పాత్రలో జాన్ అబ్రహం అదరగొట్టాడు. ప్రతినాయకుడిగా జాన్ అబ్రహం యాక్టింగ్, స్టంట్స్ కు భారీ స్పందన లభిస్తోంది. ఫలితంగా పఠాన్ సినిమా 9 రోజుల్లో రూ. 364 కోట్ల ఇండియా నెట్ కలెక్షన్స్ కొల్లగొట్టనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే పఠాన్ సినిమా ఇప్పటికే రూ. 670 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని ఊహించని రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో రోజు వసూళ్లతో ఆ గ్రాస్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    Shahrukh Khan Deepika Padukone And Director Siddharth Anand Combination Movie Pathaan 9 Days Expected Box Office Collection Is Approximately Rs 364 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X