twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    4 డేస్: ‘శైలజారెడ్డి అల్లుడు’ లాభాల్లోకి వెళ్లాలంటే ఇంకెంత రావాలి?

    |

    నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'శైలజారెడ్డి అల్లుడు' బాక్సాఫీసు రేసులో డిసెంట్ ఫలితాలు సాధిస్తోంది. ఆదివారంతో ఫస్ట్ వీకెండ్(4 డేస్) పూర్తి చేసుకున్న ఈ చిత్రం చైతూ గత చిత్రాలు 'ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం' రికార్డులను అధిగమించింది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమాయానికి శైలజా రెడ్డి అల్లుడు రూ. 28.29 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రేమమ్(రూ. 15 కోట్లు), రారండోయ్ వేడుక చూద్దాం(రూ. 18.10 కోట్ల) ఫస్ట్ వీకెండ్ రికార్డులను బద్దలు కొట్టినట్లయింది.

    చైతూకు హయ్యెస్ట్ ఓపెనింగ్స్

    చైతూకు హయ్యెస్ట్ ఓపెనింగ్స్

    సినిమాపై ముందు నుండి డీసెంట్ హైప్ ఉండటం, ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహించడంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. సెప్టెంబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రూ. 12 కోట్ల గ్రాస్ వసూలు చేసి చైతూ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

    సమంత ‘యూ టర్న్’ మీద పైచేయి

    సమంత ‘యూ టర్న్’ మీద పైచేయి

    నాగ చైతన్య భార్య సమంత నటించిన ‘యూటర్న్' మూవీ కూడా ఇదే రోజు విడుదలైనప్పటికీ ‘శైలజారెడ్డి అల్లుడు' కలెక్షన్ల పరంగా పైచేయి సాధించడం గమనార్హం. ఈ రిజల్టుపై సమంత కూడా హ్యాపీగా ఉన్నారు.

    లాభాలు రావాలంటే ఇంకా ఎంత?

    లాభాలు రావాలంటే ఇంకా ఎంత?

    శైలజారెడ్డి అల్లుడు థియేట్రికల్ రైట్స్ రూ. 24 కోట్లకు అమ్ముడయ్యాయి. నాలుగు రోజుల్లో రూ. 17.25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్లు సమాచారం. మరో రూ. 7 కోట్ల షేర్ వసూలైతే ఈ మూవీ లాభాల బాటలోకి వెళుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ఎక్కడ ఎంత?

    ఎక్కడ ఎంత?

    ఇప్పటి వరకు ఆయా ఏరియాల్లో వసూలైన షేర్ వివరాలు పరిశీలిస్తే.... నైజాంలో రూ. 6. 40 కోట్లు, సీడెడ్ రూ. 3.20 కోట్లు, వైజాగ్ రూ. 2.25 కోట్లు, ఈస్ట్ 1.45 కోట్లు, వెస్ట్ రూ. 1.15 కోట్లు, గుంటూరు రూ. 1.70 కోట్లు, కృష్ణ రూ. 1.45 కోట్లు, నెల్లూరు రూ. 80 లక్షలు.. రాబట్టింది. రెస్టాఫ్ ఇండియా రూ. 50 లక్షలు, కర్నాటక రూ. 1.60 కోట్లు, ఓవర్సీస్ రూ. 3.50 కోట్లు రాబట్టింది.

    English summary
    Shailaja Reddy Alludu has collected approximately Rs 28.29 crore gross at the worldwide box office in the four-day-extended first weekend. The movie has shattered the records of Premam and Rarandoi Veduka Chooddam, which collected Rs 15 crore and 18.10 crore gross in their opening weekend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X