twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శైలజారెడ్డి అల్లుడు 5 రోజుల కలెక్షన్లు.. మండే టెస్ట్‌లో!

    |

    నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం తొలి వీకెండ్ లో అదరగొట్టింది. వినాయక చవితి రోజు విడుదలైన ఈ చిత్ర వసూళ్లు ఆశాజనకంగా మొదలయ్యాయి. నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తూ ఈ చిత్రం తొలి రోజే 6.9 కోట్ల షేర్ ప్రపంచ వ్యాప్తంగా పిండుకుంది. వీకెండ్ మొత్తం మంచి ప్రదర్శనే కనబరిచింది. ముందుగా అనుకున్నట్లుగా ఈ చిత్ర రిజల్ట్ తేలాలంటే వీక్ డేస్ లో బాగా వసూళ్లు రాబట్టాలి. కానీ శైలజారెడ్డి అల్లుడు చిత్రం సోమవారం వసూళ్లు ఆశాజనంకంగా లేవు.

    వసూళ్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం రోజు ఈ చిత్రం 50 లక్షల షేర్ మాత్రమే సాధించింది. వీకెండ్ తో పోల్చుకుంటే 70 శాతం వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శైలజ రెడ్డి అల్లుడు చిత్రం 5 రోజుల్లో 12.20 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో 3.77 కోట్లు, సీడెడ్ లో 2.24 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.48 కోట్ల షేర్ సాధించింది.

     Shailaja Reddy Alludu 5 days box office collections

    24 కోట్ల వరకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో బయ్యర్లు ఈమేరకు గట్టున పడుతారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మారుతి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించారు. రమ్య కృష్ణ అత్త పాత్రలో నటించింది.

    English summary
    Shailaja Reddy Alludu 5 days box office collections. Big drop in monday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X