twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శైలజారెడ్డి అల్లుడు రెండవ రోజు కూడా జోరు.. పట్టు కోల్పోని చైతు సినిమా!

    |

    యుద్ధం శరణం చిత్ర నిరాశపరిచిన తరువాత నాగ చైతన్య ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ప్రయత్నం ఫలించినట్లే కనిపిస్తోంది. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రంలో నాగ చైతన్యని కొత్తగా చూపించాడు, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఇక రమ్యకృష్ణ అత్త పాత్రలో అద్భుతంగా నటించింది. తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం రెండవ రోజు కూడా స్ట్రాంగ్ గానే కలెక్షన్స్ రాబట్టింది. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల వసూళ్లు ఇప్పుడు చూద్దాం..

    ఫలించిన ఫార్ములా

    ఫలించిన ఫార్ములా

    మారుతి చిత్రాల్లో వినోదానికి పెద్ద పీట ఉంటుంది. చైతుతో కూడా మారుతి అదే ఫార్ములాని అనుసరించాడు. వినోదం ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రం ఆడియన్స్ ని అలరిస్తోంది. తొలి రోజు శైలజారెడ్డి అల్లుడు చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.7 కోట్ల షేర్ రాబట్టిన సంగతి తెలిసిందే.

    పట్టు కోల్పోకుండా

    పట్టు కోల్పోకుండా

    ఇక రెండవ రోజైన శుక్రవారం కూడా శైలజారెడ్డి అల్లుడు వసూళ్లు బాగానే ఉన్నాయి. రెండవ రోజు ముగిసే సమయానికి ఈ చిత్రం 7.7 కోట్లు రాబట్టింది. అంటే శుక్రవారం రోజు మాత్రమే 2 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

    వీకెండ్ వరకు

    వీకెండ్ వరకు

    వీకెండ్ లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే శైలజారెడ్డి అల్లుడు చిత్రం సేఫ్ జోన్ లోకి వెళుతుందని ట్రేడ్ విశేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ ఉండడంతో తొలి రోజు వసూళ్లు నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ గా నమోదయ్యాయి. రెండవ రోజు ముగిసే సమయానికి కేవలం నైజాం ఏరియాలోనే 2.38 కోట్ల షేర్ ఈ చిత్రానికి నమోదైంది.

     కలసి వచ్చే అంశం

    కలసి వచ్చే అంశం

    శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి పోటీగా మరో ధీటైన చిత్రం బరిలో లేకపోవడం కూడా కలసి వచ్చే అంశం. సమంత యూ టర్న్ చిత్రం థ్రిల్లర్ మూవీ కావడంతో శైలజారెడ్డికి పోటీ అని భావించలేం. వీకెండ్ ముగిసే సమయానికి శైలజారెడ్డి చిత్రం ఏమేరకు వసూళ్లు సాధిస్తుందనే దానిపైనే ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంది.

    English summary
    Shailaja Reddy Alludu Day 2 Box Office Collections. Naga Chaitanya movie holds strong collections in day 2 also
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X