మూడు రోజుల్లో 23 కోట్లు.... ‘శైలజా రెడ్డి అల్లుడు’ సూపర్ కలెక్షన్!
నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. తొలి రోజు రూ. 12 కోట్ల గ్రాస్ వసూలు చేసి చైతూ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవగా... మూడో రోజుకు రూ. 23 కోట్ల గ్రాస్ మార్కను క్రాస్ చేసి ట్రేడ్ పండితులను ఆశ్చర్య పరిచింది. ఈ సినిమా నాగ చైతన్య మార్కెట్ పరిధి మరింత పెరిగిందని ప్రూవ్ చేసిందని అంటున్నారు.

23 కోట్ల గ్రాస్... రూ. 10 కోట్ల షేర్
ఏపీ, తెలంగాణల్లో ‘శైలజా రెడ్డి అల్లుడు' తొలి రెండు రోజుల్లో రూ. 7.71 కోట్ల షేర్ వసూలు చేయగా.... మూడో రోజు రూ. 23 కోట్ల గ్రాస్ రావడంతో షేర్ రూ. 10 కోట్లకు చేరుకుంది. దీంతో సినిమా ప్రాఫిట్స్ జోన్లోకి వెళ్లడం ఖాయమని తేలిపోయింది.

ఫస్ట్ వీకెండ్ రూ. 30 కోట్లు ఖాయం
ఆదివారంతో సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంటుందని, దీంతో టోటల్ గ్రాస్ రూ. 30 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. సినిమా బడ్జెట్‌తో పోలిస్తే సినిమా వసూళ్లు అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.

ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ
‘శైలజా రెడ్డి రెడ్డి' అల్లుడు చిత్రానికి ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. వినోదంతో కూడిన కుటుంబ కథా చిత్రం కావడం, పాజిటివ్ మౌత్ టాక్ ఉండటంతో ఈ వీక్ బాక్సాఫీస్ రేసులో టాప్ పొజిషన్లో కొనసాగుతోంది.

శైలజా రెడ్డి అల్లుడు
ఇక యూఎస్ఏలోనూ ఈ మూవీ మంచి ఫలితాలు రాబడుతోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సమయానికి $350K నుండి $400K వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ, నాగ వంశీ ఎస్, పిడివి ప్రసాద్ నిర్మించారు. రమ్య కృష్ణ అత్త పాత్రలో నటించగా నాగ చైతన్య కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది.


Click it and Unblock the Notifications











