Shaitaan Day 11 Collections 150 కోట్లు కొల్లగొట్టిన షైతాన్.. అజయ్ దేవగన్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

దక్షిణాది స్టార్ హీరోయిన్ జ్యోతిక తొలిసారి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి నటించిన చిత్రం షైతాన్. గుజరాత్‌లో సంచలన విజయం సాధించిన వశ్ చిత్రం ఆధారంగా రూపొందిన మిస్టరీ, సస్పెన్స్, థిల్లర్ చిత్రంలో స్టార్ హీరోలు అజయ్ దేవగన్, మాధవన్ హీరోలుగా నటించారు. ఈ సినిమా మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది. గత 11 రోజులుగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న రికార్డు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

షైతాన్ సినిమా కోసం పేరున్న నటీనటులు, మల్టీ టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమా కోసం వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా భారీగా ఉయోగించారు. ఇక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ విస్తృతంగా చేశారు. నటీనటుల, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్స్‌తో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 100 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు.

Shaitaan Day 11 Expected box office collection Worldwide Ajay Devgn s Movie crosses 150 Crores at GBOC

ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 100 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టాల్సిన పరిస్థితుల్లో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. తొలి రోజు ఈ చిత్రం అంచనాలను మించి 15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ సాధించింది. ఆ తర్వాత రెండో రోజు 19 కోట్లు, 3వ రోజు 20 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. తొలివారం ముగిసే సమయానికి ఈ సినిమా 80 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక రెండోవారంలోను షైతాన్ సినిమా చెలరేగిపోయింది. బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా 8వ రోజు 5 కోట్లకుపైగా, 9వ రోజు 9 కోట్లు, 10వ రోజు 10 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టింది.

Shaitaan Day 11 Expected box office collection Worldwide Ajay Devgn s Movie crosses 150 Crores at GBOC

ఇక ఈ మూవీ 11వ రోజున కూడా భారీగా వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రెండో సోమవారం రోజున ఈ చిత్రం 5 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం సెకండ్ వీక్‌లో సంచలన రీతీలో కలెక్షన్లు నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు.

ఇదిలా ఉండగా, షైతాన్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రానికి ఓవర్సీస్‌లో హయ్యెస్ట్ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ మూవీ ఇప్పటికే 4 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారుగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇండియాలో 108 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా అజయ్ దేవగన్ మూవీ 140 కోట్లు వసూలు చేసింది. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం 150 మైలురాయిని అధిగమించి 200 కోట్ల రూపాయల మైలురాయిని దాటేందుకు రెడీ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X