Shaitaan Day 2 Collection 50 కోట్లకు చేరువగా షైతాన్‌.. దుమ్ము రేపుతున్న అజయ్ దేవగన్ మూవీ

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, టాలెంటెడ్ యాక్టర్ ఆర్ మాధవన్, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ జ్యోతిక నటించిన తాజా చిత్రం షైతాన్. హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం మార్చి 8వ తేదీన మహశివరాత్రి పండుగ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివవరాల్లోకి వెళితే..

సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన షైతాన్ సినిమా కథ విషయానికి వస్తే.. సంతోషంగా జీవితాన్ని లీడ్ చేసే ఓ కుటుంబ విహార యాత్ర కోసం ఓ పురాతన గ్రామానికి వెళ్తారు. అక్కడ మీ శ్రేయోభిలాషి అంటూ వారికి పరిచయం అవుతాడు. అతడు తన మంత్ర విద్యతో వారిని భయాందోళనకు గురిచేస్తాడు. దాంతో తాము భయంకరమైన కష్టాల్లో కూరుకుపోయామని రియలైజ్ అవుతారు. వారు అతడి తంత్ర విద్యల నుంచి ఎలా భయపడ్డారు అనేది ఈ సినిమా కథ.

Shaitaan Day 2 Estimated box office collection Worldwide Ajay Devgn s Movie racing towards 50 Crores at GBOC

గుజరాత్ సినిమా రంగంలో విజయవంతమైన వశ్ అనే సినిమా ఆధారంగా షైతాన్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అగ్ర నటులు, టాప్ టెక్నిషియన్స్ పనిచేయడంతో సినిమా బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమాను సుమారుగా 100 కోట్లతో రూపొందించారు.ఈ సినిమా ప్రమోషన్స్‌ను దేశవ్యాప్తంగా భారీగా నిర్వహించారు.

Shaitaan Day 2 Estimated box office collection Worldwide Ajay Devgn s Movie racing towards 50 Crores at GBOC

షైతాన్ సినిమాకు రిలీజ్‌కు ముందే దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడంతో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను ఇండియాలో 3000 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

షైతాన్ మూవీకి దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లు కలిపి ఈ చిత్రం 500K అమెరికన్ డాలర్లు అంటే.. సుమారుగా 4 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రెండో రోజు కూడా మరో 500K వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Shaitaan Day 2 Estimated box office collection Worldwide Ajay Devgn s Movie racing towards 50 Crores at GBOC

ఇక ఈ మూవీ ఇండియన్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు అజయ్ దేవగన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీ తొలి రోజున 15 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది. ఇక రెండో రోజు కూడా భఆరీగా అంటే.. 20 కోట్ల నికరంగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా మొత్తంగా 42 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి.. 50 కోట్లకు చేరువ్వడానికి సిద్దంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X