Shaitan Box Office Report 100 కోట్లకు చేరువైన షైతాన్..అజయ్ దేవగన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా!
గుజరాతీ భాషలో సంచలన విజయం సాధించిన వశ్ సినిమాను రీమేక్‌గా మలిచి రూపొందించిన చిత్రం షైతాన్. బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, మాధవన్, సౌత్ ఇండియన్ స్టార్ జ్యోతిక నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా గత 5 రోజులుగా నిలకడగా వసూళ్లను సాధిస్తూ 100 కోట్లకు చేరువ కాబోతున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బిజినెస్ ఎంత చేసింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను సుమారుగా 110 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక సినిమా హిట్ కావాలంటే 120 కోట్ల గ్రాస్, 60 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

సుమారుగా 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌తో థియేట్రికల్ రిలీజైన షైతాన్ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ అండ్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. హారర్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం రోజు రోజుకు కలెక్షన్లను పెంచుకొంటూ వెళ్తున్నది. హాలీడే, నాన్ హాలీడే అనే తేడా లేకుండా ఈ సినిమా వసూళ్లను సాధిస్తున్నది.
ఒక్క ఆఫర్ ప్లీజ్ - ఆ కోరికతో ఎన్నో రాత్రులు గడిపా - భోరుమన్న సురేఖా వాణి
https://telugu.filmibeat.com/news/actress-surekha-vani-emotional-comments-on-her-husband-by-crying-and-also-reacts-on-drugs-case-134567.html
షైతాన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 15.5 కోట్ల నికర వసూళ్లను మొదటి రోజు నమోదు చేసింది. ఇక రెండో రోజు 19.5 కోట్లు, 3వ రోజు 21 కోట్ల రూపాయలు రాబట్టింది. కేవలం తొలివారాంతంలోనే ఈ సినిమా 55 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ట్రేడ్ నిపుణులు తేల్చేశారు.
ఇక తొలివారాంతం తర్వాత అజయ్ దేవగన్ సినిమా కలెక్షన్ల వేగం మందగించింది. కానీ నిలకడగానే వసూళ్లను సాధించింది. ఈ సినిమా 4వ రోజు 8 కోట్ల రూపాయలు, 5వ రోజు ఈ సినిమా 7 కోట్ల రూపాయల కలెక్షన్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 70 కోట్లకుపైగా వసూళ్లను కలెక్ట్ చేసింది.


Click it and Unblock the Notifications











