Shaitan Box Office 100 కోట్లు కొల్లగొట్టిన షైతాన్.. ఎన్ని కోట్ల లాభమంటే?

గుజరాతీ భాషలో సంచలన విజయం సాధించిన వశ్ సినిమాను రీమేక్‌గా మలిచి రూపొందించిన చిత్రం షైతాన్. బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, మాధవన్, సౌత్ ఇండియన్ స్టార్ జ్యోతిక నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా గత 5 రోజులుగా నిలకడగా వసూళ్లను సాధిస్తూ 100 కోట్ల మైలు రాయిని ఏడో రోజున దాటేసింది. ఈ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Shaitan Box Office Report

2024 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా షైతాన్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతున్నది. తొలివారంలో ఈ సినిమా 100 కోట్ల మార్కును సాధించింది. సుమారు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ స్థాయికి చేరుకొన్నది.

బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో కలెక్షన్ల జర్నీని ప్రారంభించిన ఈ చిత్రం తొలి రోజు నుంచి భారీ కలెక్షన్లను సాధిస్తూ వసూళ్ల యాత్రను కొనసాగిస్తున్నది. ఈ చిత్రం రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకొంటూ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు డిమాండ్ ఉండటంతో 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఈ మూవీ 15 కోట్ల రూపాయలు తొలి రోజు వసూలు చేసింది. ఆ తర్వాత రెండో రోజు 20 కోట్లు, మూడో రోజు 20 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 8 కోట్ల రూపాయలు, 5వ రోజు 6.5 కోట్ల రూపాయలు, ఏడో రోజు 6 కోట్లు వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 80 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఈ సినిమాకు ఓవర్సీసీస్‌లో భారీ ఆదరణ దక్కింది. ఈ చిత్రం అమెరికా, ఇతర ప్రాంతాల్లో 2 మిలియన్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా 20 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్, ఇండియా కలెక్షన్లు కలిపితే.. ఈ చిత్రం 105 కోట్ల రూపాయలను నమోదు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X