Shaitaan Collections జ్యోతిక బాలీవుడ్ ఎంట్రీ.. అజయ్ దేవగన్‌కు భారీ ఓపెనింగ్స్.. షైతాన్‌కు ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు అజయ్ దేవగన్, మాధవన్, జానకీ బొడివాలా, జ్యోతిక తదితరులు నటించిన తాజా చిత్రం షైతాన్. వికాస్ బెహల్ దర్శకత్వంలో జ్యోతి దేశ్ పాండే, అజయ్ దేవగన్, కుమార్ మంగత్ పాథక్, వికాస్ బెహల్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
షైతాన్ సినిమాలో అగ్ర నటులతోపాటు భారీగా తారాగణంతో నిర్మించారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా క్రేజీగా ప్రమోషన్స్ చేశారు. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక లాంటి నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతోపాటు అన్ని ఖర్చులతో కలిపి ఈ సినిమాను 100 కోట్ల రూపాయలతో నిర్మించారు.

షైతాన్ సినిమా రిలీజ్‌కు ముందు పాజిటివ్ టాక్ రావడంతో గ్రాండ్‌గా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీని 60 దేశాల్లో రిలీజైంది. ఈ సినిమాను ఇండియాలో 3000 థియేటర్లలో, ఓవర్సీస్‌లో 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ భారీగానే ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం కనబడుతున్నది.
షైతాన్ సినిమా ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 30 శాతం, ఫస్ట్ షోకు 30 శాతం, సెకండ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ముంబైలో 30 శాతం, బెంగళూరులో 35 శాతం, చెన్నైలో 30 శాతం, చండీగఢ్‌లో 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది

ఇక షైతాన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో గ్రాండ్‌గా ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. నార్త్ ఇండియా, దక్షిణాదిలో కలిపి ఈ సినిమా 10 నుంచి 11 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా మరో 2 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందన్నారు. మొత్తంగా ఈ సినిమా తొలి రోజు 13 నుంచి 14 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తుందని చెప్పారు.
ఇక షైతాన్ సినిమా చిత్రం హిట్ కొట్టాలంటే.. ఈ సినిమా కనీసం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. తొలి రోజు 14 నుంచి 15 కోట్లు వసూలు చేస్తే.. బ్రేక్ ఈవెన్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తొలివారం ఈ సినిమా 40 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తే.. హిట్ స్టేటస్‌కు మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది.


Click it and Unblock the Notifications











