శంభో శంకరకు కలెక్షన్ల జోష్.. షకలక శంకర్‌ ‘పవర్’ ఫెర్ఫార్మెన్స్‌కు..

By Rajababu

Recommended Video

Shambo Shankara First Day Collections

కమెడియన్ షకలక శంకర్ హీరోగా మారి నటించిన శంభో శంకర చిత్రానికి మాస్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. టీజర్లు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారు. హీరోగా శంకర్‌కు తొలి సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించిందని చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

పాజిటివ్ రెస్పాన్స్‌తో

పాజిటివ్ రెస్పాన్స్‌తో

శంభో శంకర చిత్రానికి పాజిటివ్ రెస్సాన్స్ వస్తున్నది. మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.2.05 కోట్లు సాధించింది. ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు అంటూ నిర్మాత సురేష్ కొండేటి ఓ ప్రకటనలో తెలిపారు. వై రమణారెడ్డితో కలిసి సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

తొలిరోజు కలెక్షన్లు

తొలిరోజు కలెక్షన్లు

శంభో శంకర్ చిత్రాన్ని 585 థియేటర్లలో రిలీజ్ చేశాం. మొదటి రోజు మా చిత్రం 2 కోట్ల 5 లక్షల 18 వేల 125 రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ కలెక్షన్ల సునామీని ఎవరూ ఆపలేరు అని పోస్టర్‌లో పేర్కొన్నారు.

కథ రొటీనే.. కానీ

కథ రొటీనే.. కానీ

రొటీన్ కథను తీసుకొని షకలక శంకర్ ఇమేజ్‌కు తగినట్టుగా మాస్ హంగులు చేర్చి శంభో శంకర చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి శ్రీధర్ దర్శకుడు. రైతుల సమస్యలు, ఇతర సామాజిక సమస్యల ఇతివృత్తంతో ప్రేక్షకులను దర్శకుడు మెప్పించే ప్రయత్నం చేశారు.

మాస్ ప్రేక్షకుల ఆదరణ

మాస్ ప్రేక్షకుల ఆదరణ

జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంభో శంకర చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది. మాస్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నదని చిత్ర యూనిట్ పేర్కొన్నది. వారాంతంలో మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X