ఫైనల్ గా ఎన్టీఆర్ 'శక్తి' పరిస్ధితి ఏమైంది?(ట్రేడ్‌టాక్)
జూ ఎన్టీఆర్, ఇలియానా కాంబినేషన్ లో మెహర్ రమేష్ రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం 'శక్తి" భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు 45కోట్ల రూపాయల వ్యయంతో అశ్వనీదత్ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా చతికిలపడింది. అమ్మవారి శక్తి పీఠాల నేపథ్యంగా సాగిన ఈ చిత్రకథ, కథనాలు ప్రేక్షకుల నుండి శక్తి లాగేసాయి. అలాగే ఈ చిత్రం మగధీర చిత్రానికి పోలిక రావటం కూడా పెద్ద మైనస్ గా మారింది. రెగ్యులర్ ప్రేక్షకుడు కూడా పసిగట్టే కథ, కథనం ఈ శక్తి సొంతం కావటం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఇక ఈ వారం 'శక్తి" సనిమా విడుదల కారణంగా మరే చిత్రమూ రిలీజ్ కాలేదు. విడుదలైన ఈ ఒక్క చిత్రమూ ప్రేక్షకులనే కాదు, ఎన్‌టిఆర్ అభిమానులనూ అలరించలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ కీ, ఎగ్జిబిటర్స్ కూ నష్టాలు తెచ్చిపెట్టే దిశలో దూకుకుపోతోంది.


Click it and Unblock the Notifications











