ఎన్టీఆర్ 'శక్తి'పరిస్ధితి మరి అంత దిగజారిపోయిందా?
ఎన్టీఆర్ తాజా చిత్రం శక్తి భాక్సా ఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.అయితే వారం కూడా తిరగకుండా జనాలు తగ్గిపోయిన ఈ చిత్రాన్ని ఎలా అయినా నిలబెట్టాలని డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబ్యూటర్స్ కంకణం కట్టుకున్నారు.అందుకనే ధియోటర్ బయిట హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టి,టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు.బ్లాక్ లో టిక్కెట్టు కొనుక్కుని వెళ్లిన అభిమాన ప్రేక్షకుడుకి అక్కడ సగం కూడా ధియోటర్ నిండి ఉండకపోవటంతో పరిస్ధితి అర్దమై తిట్టుకునే పరిస్ధితి నెలకొంది.మరో ప్రక్క సినిమాని నిలబెట్టాలని అశ్వనీదత్ పగలనకా,రేయి అనకా తేడా లేకుండా తన టీమ్ ని మీడియాముందుకు తోసి శక్తి గురించి ఊదరకొట్టమని పురమాయిస్తున్నాడు.దాంతో టీవీ పెడితే శక్తి పోటు,ధియోటర్ కి వెళితే బ్లాక్ పోటు అన్నట్లు తయారైంది పరిస్ధితి.


Click it and Unblock the Notifications











