Shambhala Day 1 Collections: శంబాల తొలిరోజు కలెక్షన్స్... ఆది సాయికుమార్ ఎన్ని కోట్లు రాబట్టాడంటే?
ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జంటగా యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీలో స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న శంబాల మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు శంబాల మూవీ ఎన్ని కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
శంబాల కాస్ట్ అండ్ క్రూ:
శంబాల మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వం వ్యవహరించగా, ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫి, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా శంబాలపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి శంబాల మూవీకి 12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీపై ఏర్పడిన అంచనాలకు తగినట్లుగానే శంబాల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిందని ఫిలింనగర్ టాక్.

శంబాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా.. ఆంధ్రా, సీడెడ్ థియేట్రికల్ రైట్స్‌ను ఉషా పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను కుమార్ బెంగళూరు ఫిల్మ్స్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మూన్‌షైన్ సినిమాస్ దక్కించుకుంది. అయితే థియేట్రికల్ బిజినెస్‌కి సంబంధించిన లెక్కలు తెలియాల్సి ఉంది. అయితే శంబాల చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
శంబాల తొలి రోజు కలెక్షన్స్
శంబాలపై ఉన్న బజ్‌కు తగినట్లుగానే ఆది సాయికుమార్ మూవీకి టికెట్ బుకింగ్స్ బాగానే జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ట్రెండ్స్‌ని పరిశీలిస్తే తొలిరోజు చాలా చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో బుక్ మై షోలో ఏకంగా 2340 టికెట్లు బుక్ అయినట్లుగా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
తొలి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు శంబాల మూవీకి 42 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ వెల్లడించింది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో 120 షోలు, విశాఖలో 54 షోలు, విజయవాడలో 36 షోలు, బెంగళూరులో 30 షోలు చొప్పున ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ తెలిపింది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు ఆక్యూపెన్సీ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు శంబాల చిత్రానికి ఇండియాలో 47 లక్షల రూపాయల నికర కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఫస్ట్ డే ఆది సాయికుమార్ మూవీ వరల్డ్ వైడ్‌గా 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దురంధర్, అవతార్ 3, ఈషా, దండోరా, ఛాంపియన్, వృషభ వంటి సినిమాల నుంచి శంబాలకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ వీకెండ్‌లో శంబాల ఎంత వరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











