Shambhala Day 4 Collections: శంబాలకు డీసెంట్ కలెక్షన్స్.. ఆది సాయికుమార్ మూవీకి ఎన్ని కోట్లంటే?
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్. ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించగా.. యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్వాసిక విజయ్, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న శంబాల మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? నాలుగో రోజు శంబాల మూవీ ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..
శంబాల కాస్ట్ అండ్ క్రూ:
శంబాల మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వం వ్యవహరించగా, ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫి, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా శంబాలపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి శంబాల మూవీకి 12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

శంబాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా.. ఆంధ్రా, సీడెడ్ థియేట్రికల్ రైట్స్‌ను ఉషా పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను కుమార్ బెంగళూరు ఫిల్మ్స్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మూన్‌షైన్ సినిమాస్ దక్కించుకుంది. అయితే థియేట్రికల్ బిజినెస్‌కి సంబంధించిన లెక్కలు తెలియాల్సి ఉంది. అయితే శంబాల చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్స్‌లో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో 1300 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.
శంబాల మూడు రోజుల కలెక్షన్స్
శంబాలకు పెయిడ్ ప్రీమియర్స్‌తో కలిపి తొలిరోజు 1.65 కోట్ల రూపాయలు, రెండో రోజు 1.1 కోట్ల రూపాయలు, మూడో రోజు 1.25 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 4 కోట్ల రూపాయల నెట్.. 4.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ హార్రర్, సైన్స్ ఫిక్సన్ మూవీకి నార్త్ అమెరికాలో మంచి వసూళ్లు వస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. శుక్రవారం వరకు అందిన సమచారం మేరకు నార్త్ అమెరికాలో శంబాలకు 79K డాలర్లు (భారత కరెన్సీలో 70.94 లక్షల రూపాయలు) వసూలైంది.
ఇక శనివారం, ఆదివారం నాటి వసూళ్లతో కలిపి శంబాలకు కోటి రూపాయలు వసూలైనట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇతర దేశాలలో శంబాల మూవీకి 20 లక్షల రూపాయల వసూళ్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాంతో ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో ఆది సాయి కుమార్ మూవీ 1.20 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి శంబాలకు మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 5.7 కోట్ల రూపాయలు వచ్చింది.
శంబాల నాలుగో రోజు కలెక్షన్స్
ఆది సాయికుమార్ మూవీకి ఆదివారం వీకెండ్ కావడంతో బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. బుక్ మై షోలో గంటకు 2 వేల టికెట్ల చొప్పున బుక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఫస్టో షో, సెకండ్ షోలకు మరింత ఆదరణ దక్కే అవకాశం ఉంది. ఇక ఆదివారం సాయత్రం 5 గంటల వరకు శంబాలకు 36 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో సమాచారం మేరకు 4వ రోజు ఆది సాయికుమార్ మూవీ ఇండియాలో 50 లక్షల నెట్ వసూలు చేసింది. నాలుగో రోజు వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 2 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో నాలుగు రోజుల వరకు శంబాల మూవీ ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయలు సాధిస్తుంది.
శంబాల హిట్ కావాలంటే మరో 17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. అయితే దురంధర్, అవతార్ 3, ఈషా, దండోరా, ఛాంపియన్, వృషభ వంటి సినిమాల నుంచి శంబాలకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో తన థియేట్రికల్ రన్ ముగిసేసరికి శంబాల ఎంత వరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











