Shambhala Day 9 Collections: షాకింగ్‌గా శంబాల కలెక్షన్స్... ఆది సాయికుమార్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఆది సాయికుమార్, అర్చన్ అయ్యర్ హీరో హీరోయిన్లుగా యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన మూవీ శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్. హార్రర్ థ్రిల్లర్ బ్యాక్‌బ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న శంబాల మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. శ్వాసిక విజయ్, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 9వ రోజు శంబాల మూవీ ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసింది? ఈ వివరాల్లోకి వెళితే..

శంబాల కాస్ట్ అండ్ క్రూ:
శంబాల మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వం వ్యవహరించగా, ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫి, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా శంబాలపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి శంబాల మూవీకి 12 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కినట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Shambhala Day 9 Expected Box Office Collections Worldwide Aadi Saikumar s Movie faces huge drop

శంబాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా.. ఆంధ్రా, సీడెడ్ థియేట్రికల్ రైట్స్‌ను ఉషా పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను కుమార్ బెంగళూరు ఫిల్మ్స్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మూన్‌షైన్ సినిమాస్ దక్కించుకుంది. అయితే థియేట్రికల్ బిజినెస్‌కి సంబంధించిన లెక్కలు తెలియాల్సి ఉంది. అయితే శంబాల చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 25 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్స్‌లో, రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్‌లో 1300 స్క్రీన్స్‌లో విడుదల చేశారు.

శంబాల 8 రోజుల కలెక్షన్స్
శంబాలకు తొలి రోజున 1.65 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.1 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.3 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.4 కోట్ల రూపాయలు, ఐదో రోజున 65 లక్షల రూపాయలు, ఆరో రోజున 70 లక్షల రూపాయలు, ఏడవ రోజున 65 లక్షల రూపాయలు, ఎనిమిదో రోజున 2.15 కోట్ల రూపాయల చొప్పున కలెక్షన్స్ వచ్చాయి. తద్వారా ఇండియాలో 8 రోజుల వరకు 9.6 కోట్ల రూపాయల నెట్.. 11.25 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిక్ నివేదించింది.

శంబాల ఓవర్సీస్ కలెక్షన్స్
ఆది సాయికుమార్ మిస్టరీ థ్రిల్లర్ మూవీకి ఎన్ఆర్ఐ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. బుధవారం వరకు అందిన లెక్కల ప్రకారం నార్త్ అమెరికాలో శంబాల మూవీకి 170K డాలర్లు ( భారత కరెన్సీలో 1.53 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. యూకే, యూరప్, మిడిల్ ఈస్ట్, గల్ఫ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో శంబాలకు మరో 70 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో శంబాలకు ఓవర్సీస్ నుంచి మొత్తంగా ఇప్పటి వరకు 2.40 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. భారత్‌లో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి ఆది సాయి కుమార్ మూవీ 8 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 13.65 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా సాక్‌నిక్ నివేదించింది. అయితే 8 రోజుల వరకు శంబాల చిత్రం ప్రపంచవ్యాప్తంగా 16.20 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

శంబాల 9వ రోజు కలెక్షన్స్
న్యూఇయర్ కావడంతో నిన్న మంచి వసూళ్లు రాబట్టింది శంబాల. ఏకంగా 2.15 కోట్ల రూపాయల నెట్ సాధించి ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా రిలీజ్ రోజు కంటే కూడా జనవరి 1వ తేదీ వచ్చిన కలెక్షన్స్ ఎక్కువ కావడం విశేషం. అయితే కొత్త సంవత్సరం వచ్చిన మరుసటి రోజు మాత్రం శంబాల బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. 9వ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆది సాయి కుమార్ మూవీకి 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది.

కడపటి వార్తలు అందేసరికి శుక్రవారం శంబాల మూవీకి ఇండియా వైడ్‌గా 10 లక్షల రూపాయల నెట్ రాబట్టింది. దాంతో 9వ రోజు ఆది సాయి కుమార్ మూవీ వరల్డ్ వైడ్‌గా 75 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. తద్వారా ఈ సినిమా 9 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలు (సాక్‌నిక్ లెక్కల ప్రకారం) రాబట్టే అవకాశం ఉంది. శంబాల హిట్ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X