శంబాలకు క్రేజీ బిజినెస్.. వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లంటే? ఆది సాయికుమార్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న యంగ్ హీరో ఆది సాయికుమార్.. రేసులో నిలబడాలంటే భారీ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నారు. లవ్, యాక్షన్, రొమాంటిక్ సినిమాలు అన్ని ట్రై చేసినా అపజయమే ఎదురుకావడంతో ఈసారి మైథాలజీ, ఫిక్షన్, థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేశారు. అదే శంబాల. ఆది కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్, ట్రైలర్‌లతో భారీ హైప్ క్రియేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో శంబాల బడ్జెట్ ఎంత? థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అన్న వివరాలు పరిశీలిస్తే..
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా శంబాల: ఏ మిస్టికల్ వరల్డ్ సినిమాను నిర్మించారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్, శైలజ ప్రియా, ఇంద్రనీల్, ప్రవీణ్, మీసాల లక్ష్మణ్, సిజ్జు మీనన్, హర్షవర్దన్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు శ్రీచరణ్ పకాల మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించగా, ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫి, శ్రవణ్ కటికనేని ఎడిటర్‌గా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. జేవీ రామారావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తించారు. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి శంబాల మూవీకి 12 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇతర సాంకేతి అంశాల కోసం నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు చేశారు. టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో శంబాల మూవీపై టాలీవుడ్‌లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగినట్లుగానే శంబాల థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగిందని ఫిలింనగర్ టాక్.
ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకోగా.. ఆంధ్రా, సీడెడ్ థియేట్రికల్ రైట్స్‌ను ఉషా పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ను కుమార్ బెంగళూరు ఫిల్మ్స్, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను మూన్‌షైన్ సినిమాస్ దక్కించుకుంది. అయితే థియేట్రికల్ బిజినెస్ ఎంతమేర జరిగింది అన్నది తెలియాల్సి ఉంది.
మరోవైపు.. శంబాల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సంస్థ 5 కోట్ల రూపాయలకు దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సంస్థ 2 కోట్ల రూపాయలకు కైవసం చేసుకుంది. అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ దాదాపు 10 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దాంతో ఒక్క ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే సినిమా బడ్జెట్‌ను మించి రికవరీ చేసింది. శంబాల చిత్రం లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 30 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఫైనల్ బిజినెస్ డిటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాత ఆది సాయికుమార్ మూవీకి బ్రేక్ఈవెన్ టార్గెట్ మరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











