రజనీ, చిరంజీవి గెస్ట్ లుగా వస్తారు
హైదరాబాద్ : తెలుగు,తమిళం భాషల్లో మెగా డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ ఐ '. ప్రెస్టేజీయస్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ ఐ ' చిత్ర తెలుగు పాటల్ని డిసెంబర్ 30న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఆడియో వేడుకకు చైనీస్ సూపర్ స్టార్ జాకీచాన్, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు ముఖ్య అతిధిలుగా వస్తున్నట్లు చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు సీన్ మారి...రజనీకాంత్, చిరంజీవి గెస్ట్ లుగా వస్తారని తెలుస్తోంది. గచ్చిబౌలి స్టేడియంలో సుమారు 5 వేల మంది ఈ ఆడియో ఆవిష్కరణకు హాజరవుతారని సమాచారం.
ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘ ఐ ' పాటలు పెద్ద విజయం సాధించింది. తమిళంలో విడుదలైన ఆడియో వేడుకకు కండల వీరుడు ఆర్నాల్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. విక్రమ్ సరసన అమీజాక్సన్ కథనాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం, ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.ఆర్.రెహామాన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం వహించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆస్కార్ ఫిలింస్ మరియు మెగాసూపర్ గుడ్‌ఫిలింస్ సంస్థలు కలిసి ప్రేక్షకులకు అందిస్తున్నారు. భారీ వ్యయంతో అత్యద్భుతమైన సాంకేతిక విలువలతో దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమౌతుంది.

రీసెంట్ గా ‘ఐ' చిత్ర సరికొత్త ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై యుట్యూబ్‌లో 90లక్షల హిట్స్‌తో రికార్డుకెక్కింది. ఈ సరికొత్త ట్రైలర్ కూడా అందరి అంచనాలకు భిన్నంగా హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఉండటం గమనార్హం.
హీరో విక్రమ్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ట్రైలర్ చూస్తేనే అర్ధమౌతుంది.
విక్రమ్, అమీజాక్సన్‌ల మధ్య రొమాన్స్ సీన్లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన ట్రైలర్ శంకర్ మేకింగ్ స్టైల్‌తో రెండు నిమిషాలు పాటు రెప్ప వేయకుండా చూడాలనిపించే విధంగా ట్రైలర్ ఉండటం విశేషం. దీంతో సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ‘ఐ' చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ‘యు' సర్టిఫికెట్ కూడా ఈ రోజు రావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రం పదికిపైగా భాషల్లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాత ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











