twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పండక్కి రావటం లేదు...ఫ్యాన్స్ కు నిరాశ

    By Srikanya
    |

    హైదరాబాద్ : దీపావళి పండుగకు రిలీజ్ అని చెప్పిన శంకర్ భారీ చిత్రం "" రాకపోవచ్చు అని తెలుస్తోంది. అనుకున్నట్లుగా 23 న విడుదల చేయటానికి ఫైనాన్స్ కారణాలు అడ్డుపడుతున్నాయని కోలీవుడ్ టాక్. దాంతో ఈ సినిమాకోసం ఎదురుచూస్తున్న ప్యాన్స్ నిరాశపడుతున్నారు. అయితే ఈ విషయమై అంతర్గత వర్గాల సమాచారమే కానీ అఫిషియల్ ఎనౌన్సమెంట్ మాత్రం లేదు.

    పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రంకి అనుకున్న బడ్జెట్ కన్నా ఓవర్ బడ్జెట్ అవటం జరిగింది. అయితే అనుకున్న రీతిలో బిజినెస్ మాత్రం జరగలేదు. దాంతో ప్లానింగ్ ప్రకారం విడుదల చేయలేమని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే నవంబర్ 7న విడుదల కావచ్చు అని అంటున్నారు. అయితే అది కూడా డౌటే...ఈ సినిమా సంక్రాంతికే విడుదల అని మరికొందరు అంటున్నారు.

    Shankar's “I” not coming for diwali

    జయలలిత అరెస్టు కూడా ఈ చిత్రం విడుదలపై పడిందని అంటున్నారు. ఆమె తన జయ టీవీ ద్వారా ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని కొనుగోలు చేసారు. ఆమె అరెస్టు కావటంతో ఆమెకు సంభంధించిన జయ టీవి సైతం ఇప్పుడు ఆర్దిక లావాదేవిలు ఆపు చేసింది. దాంతో ఆ మొత్తం కూడా పెండింగ్ పడటంతో ఇబ్బంది ఎదురైంది అంటున్నారు.

    ఇక రెండు రోజుల క్రితం ఐ చిత్ర గ్రాఫిక్‌, నిర్మాణాంతర పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకొంది చిత్ర యూనిట్‌. ప్రస్తుతం రిలీజ్ తర్వత వేసే ప్రమోలు, రిలీజ్ కు ముందు చేయాల్సిన ప్రమోషన్ పై దృష్టి పెట్టనున్నారు.

    English summary
    Shankar and Vikram much hyped visual treat “I” will not be coming on Oct 23rd as expected.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X