యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది
హైదరాబాద్: టీజర్ సక్సెస్ ను బట్టే చిత్రం రేంజిని, బిజినెస్ ని అంచనా వేసే రోజులు ఇవి. అందుకే దర్శకులు తమ చిత్రాల టీజర్స్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వాటికి ఎన్ని హిట్స్ వచ్చాయి అనేది ఎప్పటికప్పుడు గమనించుకుంటున్నారు. తాజాగా విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఐ' యూ ట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. అమీజాక్సన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ నుంచే కాక ఇండియాలో అన్ని భాషల వారి నుంచి మంచి స్పందన వస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన టీజర్ యూట్యూబ్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. టీజర్‌లో విక్రమ్‌ను చూపించిన విధానం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మరి ఇక సినిమాలో విక్రమ్ విశ్వరూపాన్ని చూడాలంటే కొంచెం వేచి చూడాల్సిందే. యూట్యూబ్‌లో ఈ వీడియోకు హిట్లు 13 లక్షలకుపైగా దాటాయి.

దర్శకుడు శంకర్ మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం ప్రత్యేకించి పలు హాలీవుడ్ కంపెనీలు పనిచేశాయి. ఆ ప్రతినిధులు షూటింగ్ చూసి ఇలాంటి సినిమాల్లో నటించడం విక్రమ్‌లాంటి నటుడికే సాధ్యమన్నారు. అంత అంకిత భావంతో విక్రమ్ నటించాడు'' అన్నారు.
విక్రమ్ మాట్లాడుతూ ''శంకర్ లాంటి దర్శకుడి చిత్రంలో మళ్లీ నటించడం వరంగా భావిస్తున్నా. ఈ సినిమా ప్రపంచ సినీ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పుడు మీ ముందు కన్పిస్తున్న 'మృగం' వంటి పాత్ర కోసం కనిష్టంగా మూడు గంటల పాటు మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఎంతో ఓర్పుతో మేకప్ వేసుకుని కెమెరా ముందుకెళ్లాను. ఇలాంటి సినిమాలో నటించడం ఓ సవాలు లాంటిదే. ఇలాంటి మరో నాలుగు పాత్రల్లో సినిమాలో కన్పిస్తాను. ''అన్నారు.


Click it and Unblock the Notifications











