Aadavallu Meeku Johaarlu Closing Collections: శర్వానంద్ కెరీర్ మరో భారీ ఫ్లాప్.. ఎంత నష్టమంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నా శర్వానంద్ డిఫరెంట్ కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటాడు అని యూత్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. కానీ ఈ హీరో గత కొంతకాలంగా సెలెక్ట్ చేసుకుంటున్న కథలు మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంటున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా వెనెక్కి తేలేకపోయింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

రిజెక్ట్ చేసిన స్టార్ హీరో
శర్వానంద్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను ఫీల్ గుడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల తెరకెక్కించాడు. మొదట ఈ సినిమాను హీరో వెంకటేష్ తో చేయాలని అనుకున్నారు. కానీ వెంకటేష్ పూర్తి కథ విషయంలో సంతృప్తి చెందక పోవడం తో రిజెక్ట్ చేశాడు. దీంతో దర్శకుడు శర్వానంద్ తో ఈ సినిమా కథను తనకు నచ్చినట్లుగా శర్వానంద్ తో తెరపైకి తీసుకు వచ్చాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక మార్చి 4వ తేదీన వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదలకు ముందు అయితే కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.90 కోట్లు బిజినెస్ చేసింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ఓవర్సీస్‌లలో రూ. 1.60 కోట్ల వరకు బిజినెస్ చేయడంతో టోటల్ వరల్డ్ వైడ్ రూ. 15.50 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సమాచారం.

ముందు భీమ్లా ఎఫెక్ట్..
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సినిమాకు డీసెంట్ బిజినెస్ జరిగినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన వసూళ్లు దక్కలేదు. శర్వానంద్ గత సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో ప్రేక్షకులు మరోసారి అతని పై ఎక్కువగా ఫోకస్ చేయలేదు అని చెప్పాలి. ఇక మొదటి రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమాకు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మరోవైపు భీమ్లా నాయక్ పోటీగా ఉండటం.. ఆ తరువాత మరో వారానికి రాధే శ్యామ్ సినిమా రావడంతో అసలు ఈ సినిమాను జనాలు పెద్దగా పట్టించుకోలేదు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో..
'ఆడవాళ్లు మీకు జోహార్లు' మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా అందుకున్న కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ. 2.61 కోట్లు, సీడెడ్‌లో రూ. 77 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 86 లక్షలు, ఈస్ట్‌లో రూ. 51 లక్షలు, వెస్ట్‌లో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 49 లక్షలు, కృష్ణాలో రూ. 47 లక్షలు, నెల్లూరులో రూ. 30 లక్షలతో కలుపుకుని ఫైనల్ గా ఏపీ తెలంగాణలో రూ. 6.40 కోట్లు షేర్ సాదించింది.

ప్రపంచవ్యాప్తంగా..
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రూ. 6.40 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండయాలో రూ. 40 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 92 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక క్లోజింగ్ సమయానికి మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.72 కోట్లు షేర్, రూ. 11.50 కోట్ల గ్రాస్ దక్కినట్లు సమాచారం.

నష్టాలు ఏంటంటే..
శర్వానంద్ నటించిన గత నాలుగైదు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశ పరిచాయి అదే తరహాలో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా భారీ నష్టాలను మిగిల్చింది ఈ సినిమా మొత్తంగా 16 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ 16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది ఇక ఫైనల్ కలెక్షన్స్ వచ్చేసరికి కేవలం 7.72 కోట్ల షేర్ శర్వానంద్ సినిమా దాదాపూర్ ఎనిమిదిన్నర కోట్ల నష్టాన్ని మిగిల్చింది.


Click it and Unblock the Notifications











