Oke Oka Jeevitham Day 1 collections శర్వానంద్‌కు అంతా పాజిటివే.. కానీ కలెక్షన్లే షాకింగ్‌గా!
యంగ్ హీరో శర్వానంద్, హీరోయిన్ రీతూ వర్మ జంటగా అమల అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గొప్పగా ప్రదర్శన తొలి రోజు చేయలేకపోయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల అంచనా ఎంత మేరకు ఉన్నదంటే?

ఒకే ఒక జీవితం ప్రీ రిలీజ్ బిజినెస్
ఒకే ఒక జీవితం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విసయానికి వస్తే.. నైజాంలో 2.5 కోట్లు, సీడెడ్‌లో 80 లక్షలు, ఆంధ్రాలో 3.20 కోట్లతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 6.50 కోట్ల మేర బిజినెస్ చేసింది. తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో 1 కోటి రూపాయల బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7.5 కోట్ల బిజినెస్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 8 కోట రూపాయలు సాధించాల్సి ఉంటుంది.

బుక్ మై షోలో 95 శాతం రేటింగ్
ఒకే ఒక జీవితం సినిమాకు పాజిటివ్ బజ్, ఇంటర్నల్‌గా మంచి టాక్ ఉండటంతో సెప్టెంబర్ 8వ తేదీ రాత్రి ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ సినిమాకు బుక్ మై షోలో 95 శాతం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినీ విమర్శకులు కూడా భారీ రేటింగ్‌ను ఇవ్వడం సినిమాకు పాజిటివ్‌గా మారింది.

వినాయక నిమజ్జనంతో
అయితే ఒకే ఒక జీవితం సినిమాకు అన్ని పాజిటివ్ శకునాలే కనిపించినా.. కొన్ని కారణాలు సినిమా కలెక్షన్లకు అడ్డుగా నిలిచాయి. సెప్టెంబర్ 9వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జనం, వర్షాలు అడ్డంకి కాగా, బ్రహ్మస్త్ర సినిమా గట్టి పోటీగా మారాయి.

తెలుగు రాష్ట్రాల్లో అక్యుపెన్సీ
ఒకే ఒక జీవితం సినిమా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్, విజయవాడ, వరంగల్, నిజమాబాద్, గుంటూరు, కాకినాడ, రాజమండ్రితో సహా ఇతర ప్రాంత్లో గరిష్టంగా 28 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. దాంతో తొలి రోజు తక్కువగానే కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.

తమిళనాడులో అక్యుపెన్సీ
ఇక తమిళ వెర్షన్ విషయానికి వస్తే.. అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ,తమిళనాడు, కర్ణాటకలో తక్కువ అక్యుపెన్సీ నమోదైంది. చెన్నై, బెంగళూరు, మధురై, కోయంబత్తూరు, పాండిచ్చేరి, త్రివేండ్రమ్ లాంటి ప్రాంతాల్లో గరిష్టంగా 23 శాతం అక్యుపెన్సీ కనిపించింది. ఒకవేళ మౌత్ టాక్ పెరిగితే కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఒకే ఒక జీవితం తొలి రోజున మోస్తారు వసూళ్లను సాధించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 2.5 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉంబదని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ సినిమా 1 నుంచి 1.5 కోట్ల మధ్య షేర్ సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











