Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రణరంగం ఫస్ట్ డే కలెక్షన్స్.. శర్వానంద్ కెరీర్లోనే రికార్డు స్థాయిలో
యంగ్ హీరో శర్వానంద్ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'రణరంగం'. 1980 - 90 దశకాలకు సంబంధించిన కథతో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. ఆగస్టు 15వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజే డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది.
శర్వానంద్ కెరీర్లో రికార్డు స్థాయిలో
గత కొద్ది రోజులుగా రణరంగం సినిమాకు చేస్తున్న ప్రమోషన్స్, మౌత్ టాక్‌తో మొదటి రోజు థియేటర్స్ కళకళలాడాయి. దీంతో ఈ సినిమా తొలిరోజు 3.80 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. శర్వానంద్ కెరీర్లో తొలి రోజు కలెక్షన్స్ పరంగా ఇదే హైయెస్ట్ కలెక్షన్ కావడం విశేషం.
గత సినిమాను మించి
శర్వానంద్ గత సినిమా శతమానం భవతి తొలి రోజు 3.06 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టగా.. దాన్ని మించి ఈ సినిమా 3.80 కోట్లు వసూలు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ సెలవు కావడం సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తొలిరోజు థియేటర్స్ లో రణరంగం జోష్ కనిపించింది.
ఏరియా వైస్ రిపోర్ట్ చూస్తే..
నైజాంలో1.40 కోట్లు, సీడెడ్ 0.47 కోట్లు, ఉత్తరాంధ్ర 0.51 కోట్లు, గుంటూరు 0.37 కోట్లు, ఈస్ట్ గోదావరి 0.36 కోట్లు, కృష్ణ 0.23 కోట్లు, వెస్ట్ గోదావరి 0.28 కోట్లు నెల్లూరు 0.18 కోట్లు AP/TS మొత్తంగా చూస్తే 3.80 కోట్లు వసూలయ్యాయి. సినిమా బ్రేక్ ఈవెంట్ పాయింట్ రీచ్ కావాలంటే ఈ వీకెండ్ కలెక్షన్స్ కీలకం కానున్నాయి.
రణరంగం మూవీ
సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'రణరంగం' చిత్రానికి నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించాడు. చిత్రంలో శర్వానంద్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించాడు. ఇందులో శర్వానంద్‌ని సరికొత్త యాంగిల్లో చూపించారు. కాజల్ అందాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. విలక్షణ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం మిశ్రమ స్పందనతో నడుస్తోంది.