Sreekaram 7 days collections: 4కోట్లతో స్టార్ట్ చేసి వారానికే డౌన్.. రావాల్సింది చాలా ఉంది

ఫీల్ గుడ్ సినిమాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న అతికొద్ది మంది హీరోల్లో శర్వానంద్ ఒకరు. శర్వా సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతుంటారు. ఇక చాలా కాలం తరువాత ఆ నమ్మకంతోనే హిట్టు కొట్టాలని అనుకున్న శర్వానంద్ కు ఊహించని షాక్ ఎదురైంది. శ్రీకారం సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది.

సక్సెస్ లో లేకపోయినా..

సక్సెస్ లో లేకపోయినా..

శర్వానంద్ కెరీర్ లో శ్రీకారం సినిమా మరో మార్క్ ఫిల్మ్ గా నిలుస్తుందని అంతా అనుకున్నారు. నిజానికి సినిమాకు పెద్దగా నెగిటివ్ టాక్ ఏమి రాలేదు. శర్వా చేసిన గత ముడు సినిమాలు కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. శ్రీకారంతో ఎలాగైనా హిట్టు కొట్టి ఫామ్ లోకి రావాలని అనుకున్నాడు.

4కోట్లతో మొదలైన సినిమా

4కోట్లతో మొదలైన సినిమా

వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన శ్రీకారంకు రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రం 4 కోట్లతో మొదలై 5రోజుల్లోనే లక్షల్లోకి వచ్చి అంచనాలను తలకిందులు చేసింది. జాతిరత్నాలు పోటీగా ఉండడం కూడా కొంత ప్రభావం చూపించింది. అలాగే టికెట్స్ రేట్లు పెంచడం కూడా ఈ సినిమాపై ఒక విధంగా ఎఫెక్ట్ చూపించినట్లు టాక్ వస్తోంది. 7వ రోజుతో సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి.

6వ రోజు వచ్చిన షేర్స్

6వ రోజు వచ్చిన షేర్స్

శ్రీకారం సినిమాకు 7వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 6లక్షలు, సీడెడ్ 4లక్షలు, ఉత్తరాంధ్ర 2లక్షలు, ఈస్ట్ 1లక్ష, వెస్ట్ 0.3లక్ష, గుంటూరు 1.1లక్షలు, కృష్ణ 1.3లక్షలు, నెల్లూరు 0.4లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్ 0.16కోట్లు. గ్రాస్ 0.28కోట్లు..

7రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్

7రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్

మొదటి రోజు సినిమాకు 4కోట్లకు పైగా షేర్స్ రాగా రెండవ రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. 5వ రోజు అయితే 30లక్షలకు పడిపోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఆంద్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటివరకు సినిమా 8.44కోట్ల వరకు షేర్స్ వచ్చాయి. గ్రాస్ కలెక్షన్స్ 14.20కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకారం సినిమా 6 రోజుల్లో 9.13కోట్ల షేర్స్ ను రాబట్టింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ 15.50కోట్లు వచ్చాయి.

Recommended Video

Sreekaram, Jathi Ratnalu పోటాపోటీ.. కలెక్షన్స్ రిపోర్ట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్
నష్టపోకుండా ఉండాలి అంటే..

నష్టపోకుండా ఉండాలి అంటే..

శ్రీకారం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే టోటల్ గా 17.5కోట్లు రాబట్టాలి. కానీ ప్రస్తుతం లక్షల్లో షేర్స్ అందుకుంటున్న ఈ సినిమా ఇంకా 8.37కోట్ల వరకు అందుకోవాల్సి.ఉంది. మళ్ళీ కోట్లల్లో షేర్స్ అందుకుంటేనే ప్రాఫిట్స్ లోకి వస్తుంది. వీకెండ్స్ లోనే షేర్స్ దారుణంగా పడిపోయాయి. ఇక ఈ శుక్రవారం మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ సినిమాల నుంచి పోటీ ఎంతవరకు ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X