Don't Miss!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
Sreekaram Day 5 collections: దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. మంచి సినిమానే కానీ..
ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టవ్వాలి అంటే ఈ రోజుల్లో కేవలం పాజిటివ్ టాక్ ఉంటేనే సారిపోదు. రిలీజ్ విషయంలో కూడా ప్లాన్ కరెక్ట్ గా ఉండాలని అంటుంటారు. శ్రీకారం సినిమాలో లోపం అదే జరిగినట్లు తెలుస్తోంది. సినిమా మొదటి రోజు చూపించిన సందడి ఆ తరువాత రోజు నుంచి చూపించలేదు. 5వ రోజుకు వచ్చేసరికి కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ
శర్వానంద్ ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెట్టుకున్నాడు. గత ముడు సినిమాలు కమర్షియల్ గా డిజాస్టర్ కావడంతో ఎలాగైనా హిట్టు కొట్టి ఫామ్ లోకి రావాలని అనుకున్నాడు. అయితే వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన శ్రీకారంకు టాక్ అయితే పాజిటివ్ గానే వచ్చింది. అలాగే రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గా వచ్చాయి. కానీ కమర్షియల్ గా సినిమా ఇంకా లాభల్లోకి రాలేదు.
ఆ ఎఫెక్ట్ పడింది..
శర్వానంద్ తో ఫీల్ గుడ్ లాంటి సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది. శతమానం భవతి అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కానీ శ్రీకారం సినిమా ఆ అంచనాలను తలకిందులు చేసింది. జాతిరత్నాలు పోటీగా ఉండడం అలాగే టికెట్స్ రేట్లు పెంచడం కూడా ఈ సినిమాపై ఒక విధంగా ఎఫెక్ట్ చూపించినట్లు టాక్ వస్తోంది. సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ ను బట్టి ఎలాంటి పోటీ లేకుండా సరైన సమయంలో రిలీజ్ చేస్తే ఇంకా బావుండేదని కామెంట్స్ వస్తున్నాయి.
5వ రోజు వచ్చిన షేర్స్
ఇక శ్రీకారం సినిమా 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 18లక్షలు, సీడెడ్ 8లక్షలు, ఉత్తరాంధ్ర 5లక్షలు, ఈస్ట్ 3లక్షలు, వెస్ట్ 1లక్ష, గుంటూరు 1.2లక్షలు, కృష్ణ 1.1లక్షలు, నెల్లూరు 1లక్ష.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్ 38లక్షలుకోట్లు. గ్రాస్ 0.55లక్షలు
5రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్
మొదటి రోజు సినిమాకు 4కోట్లకు పైగా షేర్స్ రాగా రెండవ రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. 5వ రోజుకి ఏకంగా 30లక్షలకు పడిపోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఆంద్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటివరకు సినిమా 8.05కోట్ల వరకు షేర్స్ వచ్చాయి. గ్రాస్ కలెక్షన్స్ 13.45కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకారం సినిమా 5 రోజుల్లో 8.63కోట్ల షేర్స్ ను రాబట్టింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ 14.65కోట్లు వచ్చాయి.
నష్టపోకుండా ఉండాలంటే..
శ్రీకారం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17.5కోట్లు. సినిమా హిట్ అవ్వాలి అంటే ఇంకా 8.87కోట్ల వరకు రాబట్టాలి. అయితే సోమవారం నుంచి లక్షల్లో షేర్స్ అందుకుంటున్న ఈ సినిమా మళ్ళీ కోట్లల్లో షేర్స్ అందుకుంటేనే ప్రాఫిట్స్ లోకి వస్తుంది. వీకెండ్స్ లోనే షేర్స్ దారుణంగా పడిపోయాయి. మరి నార్మల్ డేస్ లో అయినా సినిమా నిలదొక్కుకుంటుందో లేదో చూడాలి.