Sreekaram Day 6 collections: బాక్సాఫీస్ వద్ద దారుణంగా డీలా పడ్డ శర్వానంద్ మూవీ
డిఫరెంట్ కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ ఈ సారి శ్రీకారం సినిమాతో భారీ స్థాయిలో హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ సినిమా ఊహాలకందని విధంగా కలెక్షన్స్ అందుకుంటుంది. పెట్టిన బడ్జెట్ కు వస్తున్న కలెక్షన్స్ కు ఏ మాత్రం సంబంధం లేదు. మొదటి రోజు తప్పితే మిగతా రోజుల్లో తగ్గుతూనే వస్తున్నాయి. ఇక 6వ రోజు వచ్చిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

నిరాశే మిగిలింది.
వరుస అపజయాల అనంతరం ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ తో హిట్ కొట్టాలని అనుకున్న శర్వానంద్ కు చివరికి నిరాశే మిగిలింది. గత ముడు సినిమాలు కమర్షియల్ గా డిజాస్టర్ కావడంతో ఎలాగైనా హిట్టు కొట్టి ఫామ్ లోకి రావాలని అనుకున్నాడు. వ్యవసాయం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన శ్రీకారంకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ లాభల్లోకి రాలేదు.
అర్ధనగ్నంగా జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఫోటోషూట్.. గ్లామర్‌తో దిమ్మతిరిగేలా

ఆ ఎఫెక్ట్ గట్టిగానే చూపించింది
శతమానం భవతి సక్సెస్ అనంతరం మళ్ళీ అదే టైప్ లో హిట్టు కొట్టాలని అనుకున్నడు. అయితే శ్రీకారం సినిమా ఆ అంచనాలను తలకిందులు చేసింది. జాతిరత్నాలు పోటీగా ఉండడం కూడా ఎఫెక్ట్ చూపించింది. దాంతో పాటు టికెట్స్ రేట్లు పెంచడం కూడా ఈ సినిమాపై ఒక విధంగా ఎఫెక్ట్ చూపించినట్లు టాక్ వస్తోంది. 6వ రోజు కనీసం 50లక్షల షేర్స్ అందుకోలేకపోయింది.

6వ రోజు వచ్చిన షేర్స్
ఇక శ్రీకారం సినిమా 6వ రోజు తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 9లక్షలు, సీడెడ్ 5లక్షలు, ఉత్తరాంధ్ర 3లక్షలు, ఈస్ట్ 1.8లక్షలు, వెస్ట్ 0.6లక్ష, గుంటూరు 1లక్షలు, కృష్ణ 1.8లక్షలు, నెల్లూరు 0.6లక్ష.. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్ 0.23కోట్లు. గ్రాస్ 0.40కోట్లు

6రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్
మొదటి రోజు సినిమాకు 4కోట్లకు పైగా షేర్స్ రాగా రెండవ రోజు నుంచి తగ్గుతూ వచ్చాయి. 5వ రోజు నుంచి ఏకంగా 30లక్షలకు పడిపోవడం షాకింగ్ అనే చెప్పాలి. ఆంద్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటివరకు సినిమా 8.28కోట్ల వరకు షేర్స్ వచ్చాయి. గ్రాస్ కలెక్షన్స్ 13.85కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీకారం సినిమా 6 రోజుల్లో 8.88కోట్ల షేర్స్ ను రాబట్టింది. ఇక గ్రాస్ కలెక్షన్స్ 15.10కోట్లు వచ్చాయి.

సినిమా హిట్ అవ్వాలి అంటే
శ్రీకారం సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే 17.5కోట్లు రాబట్టాలి. సినిమా హిట్ అవ్వాలి అంటే ఇంకా 8.62కోట్ల వరకు రాబట్టాలి. కానీ ప్రస్తుతం లక్షల్లో షేర్స్ అందుకుంటున్న ఈ సినిమా మళ్ళీ కోట్లల్లో షేర్స్ అందుకుంటేనే ప్రాఫిట్స్ లోకి వస్తుంది. వీకెండ్స్ లోనే షేర్స్ దారుణంగా పడిపోయాయి. మరి నార్మల్ డేస్ లో అయినా సినిమా నిలదొక్కుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











