Sreekaram Day 1 collections: షాక్ ఇచ్చిన శర్వానంద్.. సినిమా ఎంత వసూలు చేసిందంటే!
ఫీల్ గుడ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ హీరో శర్వానంద్ ఈ సారి శ్రీకారం సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ను మరింత ఆకట్టుకున్నాడు. వ్యవసాయం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక మొదట రోజు సినిమాకు కలెక్షన్స్ డీసెంట్ గానే వచ్చాయి. పోటీగా మరో రెండు సినిమాలున్నా కూడా శర్వానంద్ తన స్టార్ డమ్ తో మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు.

వరుసగా డిజాస్టర్స్
శర్వానంద్ గత సినిమాలు కొన్ని వరుసగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ కుర్ర హీరో మార్కెట్ పై కొంత కూడా ప్రభావం పడలేదని అర్ధమవుతోంది. 2017లో మహానుభావుడు అనంతరం ఒక్క హిట్టు కూడా కొట్టలేదు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాల రిజల్ట్ గురించి అందరికి తెలిసిందే.

ఈ స్పీడ్ సరిపోదేమో..
సాధారణంగా ఒక హీరో సినిమా ప్లాప్ అయితే నెక్స్ట్ సినిమాపై ఎంతో కొంత ప్రభావం కనపడుతుంది. కానీ శర్వానంద్ సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ ఆ ప్రభావాన్ని చూపడం లేదు. ఇక శ్రీకారం సినిమా 17కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి రావడం విశేషం. పైగా సినిమాకు మొదటి రోజు పరవాలేదు అనిపించే విధంగా కలెక్షన్స్ వచ్చాయి కానీ టార్గెట్ అందుకోవాలి అంటే ఈ స్పీడ్ సరిపోదని అనిపిస్తోంది.

మొదటి రోజు వచ్చిన షేర్స్
శర్వానంద్ శ్రీకారం మొదటి రోజు అందుకున్న షేర్ కలెక్షన్స్.. ఏరియాల వారిగా ఈ విధంగా ఉన్నాయి. నైజాం 1.08కోట్లు, సీడెడ్ 72లక్షలు, ఉత్తరాంధ్ర 54లక్షలు, ఈస్ట్ 44లక్షలు, వెస్ట్ 27లక్షలు, గుంటూరు 65లక్షలు, కృష్ణ 23.10లక్షలు, నెల్లూరు 14లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన మొత్తం షేర్స్ 4.07కోట్లు.

వరల్డ్ వైడ్ మొత్తం ఎంతంటే..
ఓవర్సీస్ లో 12లక్షలకు పైగా షేర్స్ అందుకున్న శ్రీకారం ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 4.29కోట్ల షేర్స్ అందుకుంది. గ్రాస్ కలెక్షన్స్ 7.30కోట్లు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17.5కోట్లు. సినిమా హిట్ అవ్వాలి అంటే ఇంకా 13.21కోట్ల వరకు రాబట్టాలి. జాతిరత్నాలు సినిమా నుంచి కొత్త పోటీ ఉండడంతో బ్రేక్ ఈవెన్ ను అందుకునేందుకు కొంత సమయం పట్టవచ్చని టాక్ వస్తోంది.


Click it and Unblock the Notifications











