Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Sreekaram Day 3 collections: శర్వానంద్‌కు ఉహించని ఝలక్.. ఇంకా ఎంత రావాలంటే!
శర్వానంద్ లాంటి హీరోతో ఒక మంచి ఫీల్ గుడ్ లాంటి సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఉంది. శతమానం భవతి అందుకు ఉదాహరణగా నిలిచింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించింది. ఇక చాలా కాలం తరువాత అదే తరహాలో మంచి మెస్సేజ్ ఇస్తూ చేసిన చిత్రం శ్రీకారం. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే అందుకున్నప్పటికి 3వ రోజు ఊహించని షాక్ ఇచ్చింది. హిట్టవ్వాలంటే ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటే సరిపోదు. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..
బెడ్
మీద
హాట్
ఫోజుతో
బబ్లీ
తెలుగు
హీరోయిన్
(ఫోటోలు)
రెండవ రోజు నుంచి షాక్..
వ్యవసాయం నేపథ్యంలో వచ్చిన శ్రీకారం సినిమాను కొత్త దర్శకుడు కిషోర్ తెరకెక్కించాడు. టీజర్ తోనే సినిమా కాన్సెప్ట్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదట రోజు సినిమాకు కలెక్షన్స్ డీసెంట్ గానే వచ్చాయి. అయితే రెండవ రోజు నుంచి మాత్రం కలెక్షన్స్ ఒక్కసారిగా తగ్గుతూ వస్తున్నాయి. పోటీగా మరో రెండు సినిమాలు రిలీజైన విషయం తెలిసిందే.
జాతిరత్నాలు ఎఫెక్ట్..
శ్రీకారం సినిమాకు ప్రమోషన్ విషయంలో అంతగా క్లిక్కవ్వలేదు. పాజిటివ్ రివ్యూలు అలాగే ఓ వర్గం ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా అనుకున్నంత రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకోలేకపోతొంది. మరోవైపు జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తోంది. దీంతో కలెక్షన్స్ తగ్గుతున్నాయి.
శ్రీకారం బడ్జెట్ ఎంతంటే?
శర్వానంద్ శ్రీకారం సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే గత ముడు సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. మహానుభావుడు అనంతరం ఒక్క హిట్టు కూడా పడలేదు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను సినిమాల రిజల్ట్ గురించి అందరికి తెలిసిందే. ఇక శ్రీకారం సినిమాకు 15కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.
3వ రోజు వచ్చిన షేర్స్
శర్వానంద్ శ్రీకారం మూడవ రోజు అందుకున్న షేర్ కలెక్షన్స్.. ఏరియాల వారిగా ఈ విధంగా ఉన్నాయి. నైజాం 38లక్షలు, సీడెడ్ 19లక్షలు, ఉత్తరాంధ్ర 18లక్షలు, ఈస్ట్ 11లక్షలు, వెస్ట్ 7లక్షలు, గుంటూరు 10లక్షలు, కృష్ణ 7.3లక్షలు, నెల్లూరు 6లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్ 1.16కోట్లు. గ్రాస్ 1.85కోట్లు
మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఓవర్సీస్ లో ఇప్పటివరకు 20లక్షలకు పైగా షేర్స్ అందుకున్న శ్రీకారం ప్రపంచవ్యాప్తంగా 3రోజుల్లో మొత్తంగా 7.09కోట్ల షేర్స్ అందుకుంది. గ్రాస్ కలెక్షన్స్ 12.10కోట్లు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17.5కోట్లు. సినిమా హిట్ అవ్వాలి అంటే ఇంకా 10.41కోట్ల వరకు రాబట్టాలి. ఆదివారం ఒక్కరోజు మాత్రమే ఎక్కువ కలెక్షన్స్ అందుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మరి సినిమా ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.